|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లిలో కట్నం కలకలం! ఎన్ని కోట్లు ముట్టజెప్పారో తెలిస్తే షాక్ అవుతారు!

Published: 24-02-2026, 4:35 AM
అల్లు శిరీష్ పెళ్లిలో కట్నం కలకలం! ఎన్ని కోట్లు ముట్టజెప్పారో తెలిస్తే షాక్ అవుతారు!
  • అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది.
  • వరుణ్ తేజ్ పార్టీలో అల్లు శిరీష్, నయనికా రెడ్డి మొదటిసారి కలుసుకున్నారు.
  • దుబాయ్‌లో బ్యాచ్‌లర్ పార్టీ, హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీల కోసం పార్టీ జరిగింది.
  • నయనికా రెడ్డి తండ్రి భారీగా కట్నం ఇస్తున్నట్లు సమాచారం.

ప్రముఖ నటుడు అల్లు శిరీష్, నయనికా రెడ్డి మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నయనికా రెడ్డి కట్నం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అల్లు శిరీష్ – నయనికా రెడ్డిల వివాహం ఎప్పుడు?

Allu Sirish – Nayanika Reddy:ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యిందో లేదో అప్పుడే సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda ) ఫిబ్రవరి 26న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుండగా.. మార్చి 6వ తేదీన అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయానికా రెడ్డి (Nayanika Reddy) తో కలిసి ఏడు అడుగులు వెయ్యబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే అల్లు శిరీష్ కి కట్నం కింద నయనికా రెడ్డి ఎంత ఇస్తోంది? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

2023 అక్టోబర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం సందర్భంగా ప్రముఖ నటుడు నితిన్ ఆయన భార్య షాలిని నిర్వహించిన పార్టీలో షాలిని స్నేహితురాలైన నయానికాను అల్లు శిరీష్ మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి ,రెండేళ్ల ప్రేమాయణం తర్వాత 2025 అక్టోబర్ 31న అల్లు, మెగా కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు..

దుబాయ్, హైదరాబాద్ లలో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్

ఇకపోతే అల్లు శిరీష్ నయనికా రెడ్డి వివాహం జరగబోతున్న నేపథ్యంలో.. అల్లు శిరీష్ తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం దుబాయ్ లోని యాచ్ లో ఘనంగా ప్రత్యేక పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాలలో ఈ ప్రత్యేక పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరొకవైపు ఇటు స్వదేశంలో అనగా హైదరాబాదులో అల్లు అర్జున్ సినీ సెలబ్రిటీల కోసం ప్రైవేటు పార్టీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హీరోయిన్లు సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే మరోవైపు అల్లు శిరీష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. పసుపు దంచే కార్యక్రమాలను కుటుంబ సభ్యులు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ పసుపు వేడుక కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి , మెగా కోడలు ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన తరువాత ఉపాసన తొలిసారి అటెండ్ అయిన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఇదే కావడం గమనార్హం.

నయనికా రెడ్డి కట్నం గురించిన ఆసక్తికర విషయాలు

ఇకపోతే నయానికా రెడ్డి హైదరాబాదుకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురు. ఈ నేపథ్యంలోనే అల్లు గారి కుటుంబానికి భారీ స్థాయిలో కట్నం కింద ఇస్తున్నట్లు సమాచారం . ముఖ్యంగా హై ప్రొఫైల్ కుటుంబాల మధ్య జరగనున్న ఈ పెళ్లి అత్యంత ఘనంగా జరగబోతోంది. స్థాయికి తగ్గట్టుగా అల్లు శిరీష్ కాబోయే భార్య కూడా అదే రేంజిలో భారీగా కట్న కానుకలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మొత్తానికి అల్లు శిరీష్, నయనికా రెడ్డిల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.