|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Sirish: పెళ్లిపై అల్లు శిరీష్ నాట్ ఇంట్రెస్ట్.. ఎందుకంటే?

Published: 08-05-2025, 12:13 PM
Allu Sirish: పెళ్లిపై అల్లు శిరీష్ నాట్ ఇంట్రెస్ట్.. ఎందుకంటే?

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి గురించి తాజా వార్తలు వస్తున్నాయి. పదేళ్ల నుంచి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని కోరుతున్నప్పటికీ, శిరీష్ పెళ్లికి ఇంకా ఆసక్తి చూపించట్లేదు. #సింగిల్ మూవీ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించాడు.

Key Points

1

అల్లు శిరీష్ పెళ్లికి ఇంకా ఆసక్తి చూపించడం లేదు.

2

తల్లిదండ్రులు పదేళ్లుగా పెళ్లి చేసుకోమని కోరుతున్నారు.

4

#సింగిల్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం వెల్లడైంది.

శిరీష్ పెళ్లి ప్రణాళికలు

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది యువత పెళ్లంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ తమ్ముడిని కూడా పదేళ్లుగా పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడుగుతున్నా సరే నో చెబుతున్నాడట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా శిరీష్  బయటపెట్టాడు.

అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిరీష్.. గమనం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు తదితర సినిమాలు చేశాడు. చివరగా ‘బడ్డీ’ అనే మూవీలో కనిపించాడు. ప్రస్తుతానికైతే మూవీస్ చేయట్లేదు. గతంలో కలిసి పనిచేసిన ఓ హీరోయిన్ తో శిరీష్ రిలేషన్ లో ఉన్నాడనే రూమర్స్ వచ్చాయి గానీ తర్వాత పెద్దగా సౌండ్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు.

కుటుంబ సభ్యుల ఒత్తిడి

అ‍ల్లు అరవింద్ నిర్మిచిన #సింగిల్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిర్వహించారు. దీనికి హాజరైన శిరీష్ ని పెళ్లెప్పుడు చేసుకుంటారు, ఇప్పటివరకు ఎందుకు చేసుకోవట్లేదని యాంకర్ సుమ అడిగింది. దీనికి సమాధానంగా..’మా ఇంట్లో వాళ్ల కన్నా మీరే ఎ‍క్కువ అడుగుతున్నారు. మీరెప్పుడు కలిసినా నన్ను ఇదే అడుగుతున్నారు. సంబంధం చూస్తారా ఏంటి?’ అని అన్నాడు. దీనికి కౌంటర్ గా పక్కనే కూర్చున్న అల్లు అరవింద్.. పదేళ్ల నుంచి చేసుకోమని బతిమాలాడుతున్నా సరే చేసుకోవట్లేదని చెప్పుకొచ్చారు.

#సింగిల్ మూవీ ఈవెంట్ లో వెల్లడి

దీంతో శిరీష్ మాట్లాడుతూ.. పెళ్లయిన నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ‍్ళి, మీ లైఫ్ ఎలా ఉంది? నన్ను కూడా చేసుకోమంటారా అని అడిగితే చేసుకోవద్దు, సింగిల్ గానే లైఫ్ బాగుంటుందని సలహా ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన సుమ.. నేను పెళ్లి చేసుకోను అని అన్నవాళ్లంతా ఏదో ఓ రోజు చేసుకోవాల్సిందే, మీరు చేసుకుంటారు అప్పుడు నేను వస్తానని నవ్వేసి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే శిరీష్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడేమో అనే సందేహం వస్తోంది.

చివరగా, అల్లు శిరీష్ తన పెళ్లి గురించి స్పష్టతనిచ్చాడు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవడంలో ఆసక్తి లేదని తెలిపాడు. అతని నిర్ణయం అతనిదే అని మనం గౌరవించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.