
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి ఒక సినిమా షూటింగ్ సమయంలో జలపాతం సన్నివేశంలో తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడని నటి కాజోల్ వెల్లడించింది. ఈ సంఘటన ఎంత ఆశ్చర్యకరంగా ఉందో తెలుసుకుందాం.
Key Points
జలపాతం సన్నివేశంలో అమ్రిష్ పురి జ్ఞాపకశక్తి కోల్పోయారు.
మూడు గంటల తర్వాత ఆయనకు జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది.
అమ్రిష్ పురి తన కెరీర్ లో అనేక విలన్ పాత్రలు పోషించారు.
అమ్రిష్ పురి జ్ఞాపకశక్తి కోల్పోవడం
హీరోయిన్ కాజోల్‌కు మతిమరుపు ఉండేది. కుచ్‌కుచ్ హోతా హై సినిమా సెట్‌లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి ( Amrish Puri ) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్‌గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు.
అంతా మర్చిపోయిన అమ్రీష్‌పురి అందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్‌ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్‌ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్‌లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది.
కాజోల్ వివరణ
కరడుగట్టిన విలన్‌గా.. ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్‌గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్‌చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్‌గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
అమ్రిష్ పురి సినిమా జీవితం
అమ్రిష్ పురి వంటి గొప్ప నటుడి జ్ఞాపకశక్తి కోల్పోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఘటన ఆయన సినిమా జీవితంలో ఒక ఆసక్తికరమైన అనుభవంగా మిగిలిపోయింది.


