|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్ సంచలనం! జానీ మాస్టర్‌కు అనంత శ్రీరామ్ సీక్రెట్ చెప్పేశారా? వైరల్!

Published: 04-03-2026, 10:05 AM
రామ్ చరణ్ 'పెద్ది' సాంగ్ సంచలనం! జానీ మాస్టర్‌కు అనంత శ్రీరామ్ సీక్రెట్ చెప్పేశారా? వైరల్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్, బుచ్చిబాబు సన దర్శకత్వం!
  • ఏఆర్ రెహమాన్ సంగీతం, ‘రై రై రారా’ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్!
  • జానీ మాస్టర్‌తో అనంత శ్రీరామ్ చర్చలు, పాట చిత్రీకరణలో కీలక మార్పులు!
  • సాహిత్యం, కొరియోగ్రఫీ అద్భుతంగా కుదిరాయని అనంత శ్రీరామ్ ప్రశంసలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ మీకోసం! ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

‘పెద్ది’ సాంగ్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన అనంత శ్రీరామ్!

ప్రముఖ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు లిరిక్స్ అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా శ్రీరామ్ కేవలం లిరిక్స్ అందించడం మాత్రమే కాకుండా నటనపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.

జానీ మాస్టర్‌తో ఏం చెప్పారో తెలుసా?

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రై రై రారా అంటూ సాగే సాంగ్ను తాజాగా విడుదల చేశారు. దీనికి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్లోని సాహిత్యానికి, డాన్స్ మూమెంట్స్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ లిరిక్ రైటర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన పెద్ది సినిమాలోని రెండవ సాంగ్ సాహిత్యపరంగా, డాన్సుల విషయంలో సక్సెస్ కావడానికి గల సీక్రెట్ను చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్ మూవీపై భారీ అంచనాలు!

అనంత శ్రీరామ్ తాజాగా మాట్లాడుతూ… రై రై రారా అంటూ సాగే పాట మోటివేషనల్గా ఉంటుంది. దానికోసం పదాలను కూడా అదే స్థాయిలో రాశాను. జానీ మాస్టర్ గారు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ కొరియోగ్రఫీ చేస్తారు. ఈ సాంగ్ చిత్రీకరణ స్టార్ట్ అయ్యే ముందు ఆయనకు ఒక విషయం చెప్పాను. ఇందులో మనిషి జీవితం గురించి అనేక పదాలు ఉన్నాయి. ఆ సమయంలో భారీ డ్యాన్స్ మూమెంట్స్ వస్తే మంచిది కాదేమో? మామూలు మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పాను. ఆయన కూడా అదే విధంగా చేశారు. ఈరోజు ఈ సాంగ్ అటు సాహిత్యం ఇటు కొరియోగ్రఫీ పరంగా సూపర్ సక్సెస్ అయ్యింది అంటే జానీ మాస్టర్ గారి శ్రద్ధ అందుకు ప్రధాన కారణం అని ఈయన చెప్పుకొచ్చారు.

అనంత శ్రీరామ్ మాటలు జానీ మాస్టర్ వినడం వల్లే పాట ఇంత సక్సెస్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.