|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ ఫైర్: నా పరువు పోలేదు, దానికి నేనేం చేయాలి? ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే సమాధానం!

Published: 08-01-2026, 10:00 AM
అనసూయ ఫైర్: నా పరువు పోలేదు, దానికి నేనేం చేయాలి? ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే సమాధానం!
  • నటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ, కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేదని అనసూయ అభిప్రాయపడింది.
  • తన దుస్తుల ఎంపిక వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఎప్పుడు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటానని స్పష్టం చేసింది.
  • తన పరువు భద్రంగా ఉందని, పరువు పోతుందన్న విమర్శలు అర్థరహితమని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
  • తన భర్త తనను పూర్తిగా అర్థం చేసుకుంటారని, వివాదాలకు తన కుటుంబాన్ని దూరంగా ఉంచుతానని తెలిపింది.

నటి అనసూయ భరద్వాజ్ ఇటీవల తన దుస్తుల ఎంపిక, వివాదాలపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చింది. శివాజీ వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ, తన పరువు భద్రంగా ఉందని, ఇతరుల విమర్శలు అనవసరమని స్పష్టం చేసింది. ట్రోలర్స్‌కు ధీటైన కౌంటర్ ఇచ్చింది.

శివాజీ వ్యాఖ్యలపై అనసూయ మరోసారి స్పందన

Anasuya Bharadwaj: విషయం ఎలాంటిదైనా… ముందుండి మాట్లాడే వ్యక్తిగా అనసూయ తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. గుర్తింపు పొందింది. ఇటీవల నటుడు శివాజీ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పైన కూడా ఈమె ఎక్కువగానే రియాక్ట్ అయ్యింది. దాదాపు ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యే అనసూయని కొందరు సపోర్ట్ చేయగా కొందరు మాత్రం నెగటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు అవసరం లేకుండా మాటలతో తన పరువు తానే తీసుకుంటోందని విమర్శిస్తూ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఈ నటి ఈ విషయాలపై ఒక ఇంటర్వ్యూలో స్పందించింది

శివాజీ వ్యాఖ్యల తర్వాత “అనసూయ చీరలు కడుతుందట” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి దీనిపైన మీ స్పందన ఏమిటి అని యాంకర్ ఆమెను అడగా.. “నా తరపున వాళ్లకు రెండు మొట్టికాయలు వేయండి” అంటూ చెప్పుకొచ్చింది. తనకు చీరలంటే ఇష్టం అని..అలాగే ఫ్యాషన్ డ్రెస్స్‌లంటే కూడా ఇష్టమేనని చెప్పింది. తనకు ఎప్పుడు ఏది వేసుకోవాలనిపిస్తే అదే వేసుకుంటానని.. ఇది ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు అని అనసూయ తెలిపింది.

శారీ స్టోర్ ఓపెనింగ్‌కు వెళ్తే చీర కట్టుకుంటానని, అదే విధంగా వేరే ఈవెంట్లకు వేరే డ్రెస్స్‌లు వేసుకుంటానని చెప్పింది. గత పదేళ్లుగా ఇదే చేస్తున్నానని..ఇందులో కొత్తగా ఏమీలేదని స్పష్టం చేసింది.

దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై అనసూయ అభిప్రాయం

అదే సమయంలో శివాజీ మాటలపై కూడా మరోసారి తన అభిప్రాయం చెప్పింది. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో మాట్లాడటం తప్పు కాదని..కానీ కొన్ని పదాలు వాడకుండా ఉంటే ఇంకా బాగుండేదని అనసూయ చెప్పింది. సినిమా పాత్రల ప్రభావాన్ని నిజ జీవితంలోకి తీసుకురావద్దని… సినిమాలో చేసిన పాత్రలు సినిమా వరకే పరిమితం కావాలని తెలిపింది.

మహిళల భద్రత గురించి మాట్లాడేటప్పుడు అబ్బాయిలను కూడా బాధ్యతగా ఉండమని.. అమ్మాయిలకు తోడుగా ఉంటామని.. శివాజీ గారు చెప్పుంటే బాగుండేది అని.. అలా చెప్పితే సమాజానికి మంచి సందేశం వెళ్లేదని అనసూయ అభిప్రాయపడింది.

“అటెన్షన్ కోసం అన్ని విషయాల్లో కలగజేసుకొని మీ పరువు తీసుకుంటున్నారు కదా..” అనే విమర్శలపై కూడా ఆమె స్పందించింది. ఇక్కడ ఎవరి పరువు పోయిందని ప్రశ్నించింది. తన పరువు తన దగ్గరే భద్రంగా ఉందని..తాను ఎప్పుడూ నెగెటివ్‌గా మారలేదని చెప్పింది.

పరువు పోతుందన్న విమర్శలకు గట్టి కౌంటర్

ట్రోల్స్ గురించి మాట్లాడుతూ..తన భర్త తనను పూర్తిగా అర్థం చేసుకుంటాడని తెలిపింది. తన భర్త, పిల్లలను ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంచుతానని చెప్పింది. అర్థం చేసుకునే భర్త దొరకడం తన అదృష్టమని అనసూయ చెప్పింది. తన జీవితం, తన నిర్ణయాలు.. వాటి ప్రభావం తనవేనని ఆమె మరోసారి స్పష్టం చేసింది.

మొత్తమ్మీద, అనసూయ తన పరువు, వ్యక్తిగత స్వేచ్ఛపై స్పష్టతనిచ్చింది. వివాదాలకు భయపడనని, తన కుటుంబానికి వాటిని దూరంగా ఉంచుతానని ఆమె వ్యాఖ్యలు ధైర్యానికి నిదర్శనం. ట్రోలర్స్‌కు దీటుగా బదులిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.