
యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ నటించిన ‘అరి’ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం చివరకు విడుదలవుతోంది. రెండేళ్ల క్రితం టీజర్ విడుదలైనా, వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Key Points
రెండేళ్ల తర్వాత అనసూయ నటించిన 'అరి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
మే 30న థియేటర్లలో 'అరి' మైథలాజికల్ థ్రిల్లర్ ప్రదర్శన.
టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు సినిమాను ప్రశంసించారు.
రెండేళ్ల విడుదల వాయిదా తర్వాత..
యాంకర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. పుష్ప 2, రజాకార్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ మాజీ యాంకర్ నటించిన లేటెస్ట్ మూవీనే అరి. సైకో మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ తోపాటు సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖులు నటించారు.
పేపర్ బాయ్ మూవీతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జయ శంకర్ అరి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, అరి సినిమా మొదలుపెట్టి రెండేళ్లకుపైగా అవుతోంది. రెండేళ్ల క్రితం అంటే 2023 మార్చిలో అరి టీజర్‌ను రిలీజ్ చేశారు. అరి టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఒక్కో పాత్ర ఒక్కో దురాశ గురించి చెబుతూ ఇంటెన్సివ్‌గా కనిపించింది.
దాంతో అరి మూవీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు అరి థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేదు. ఎన్నో అవంతరాలు దాటి ఇప్పుడు థియేటర్లలోకి అడుగుపెట్టబోతుంది అరి మూవీ. గతేడాదే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన అరి వాయిదా పడింది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఇదే మే నెలలో ఒకసారి పోస్ట్‌పోన్ అయింది ఈ సినిమా.
‘అరి’ సినిమా ప్రత్యేకతలు..
మొదటగా మే 9న అరి మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, కాలేదు. దాంతో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో అరి మూవీని ప్రమోట్ చేయించారు. ఇక ఇప్పుడు అరి మూవీ రిలీజ్ డేట్ అంటూ మరో తేదిని మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 30న అరి థియేట్రికల్ రిలీజ్‌కు రెడీగా ఉందంటూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ఎలాంటి అవంతరాలు లేకుండా మే 30న థియేటర్లలో అరి ప్రదర్శించనున్నట్లు మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్ , శుభలేఖ సుధాకర్‌తోపాటు వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ప్రముఖుల ప్రశంసలు..
అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి అరి సినిమాను నిర్మించారు. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో భాగంగా అరి మూవీని ప్రదర్శించారు. అరి వీక్షించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ప్రశంసలు కురిపించారు.
భగవద్గీత లోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని చెప్పారు. అరిషడ్వర్గాల మీద తీసిన అరి మూవీ ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడారు. మరి మే 30న థియేట్రికల్ రిలీజ్ తర్వాత అరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
మే 30న విడుదలవుతున్న ‘అరి’ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. అనసూయ నటన, కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.


