
📌 Key Points
- అనసూయ సీరియస్ పోస్ట్ వైరల్: నెటిజన్ల ట్రోలింగ్‌పై ఘాటు రియాక్షన్!
- శివాజీ వ్యాఖ్యలపై అనసూయ స్పందన: మహిళల భద్రతపై తన అభిప్రాయం!
- సోషల్ మీడియాలో అనసూయ రచ్చ: ఫోటోలు, వీడియోలతో అభిమానులకు ట్రీట్!
- ‘పుష్ప’ చిత్రంలో అనసూయ నటనకు ప్రశంసలు: రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించిన నటి!
టాలీవుడ్ యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు అనసూయ ఎందుకు అంత సీరియస్ అయ్యారో తెలుసుకుందామా?
నెటిజన్ల ట్రోలింగ్‌పై అనసూయ ఫైర్!
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
శివాజీ కామెంట్స్‌పై అనసూయ రియాక్షన్ వైరల్!
ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. అందులో.. ‘రేయ్ రేయ్.. ఇంకేంత ట్విస్ట్ చేస్తార్రా మాటలను.. ఎవరు యూ టర్న్ తీసుకున్నారు. ఎవరు దిగొచ్చారు. ఎవరు ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు. ఇంకా ఇంతేనా మీ గతి.. వేరే పనికొచ్చే న్యూస్/డిస్కషన్ పెట్టుకోండ్రా బాబు’ అని రాసుకొస్తూ తల పట్టుకున్న వీడియో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో అనసూయ రచ్చ!
కాగా నిన్న ఓ నెటిజన్ మేడమ్ శివాజీ చెప్పిన పాయింట్ కరెక్ట్ కానీ అతను వాడిన రెండు పదాలు మాత్రం బ్యాడ్‌గా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు ఆమె.. ‘శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు.. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. కానీ కేవలం అమ్మాయిలను హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది’ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది ఎట్టకేలకు అనసూయ తప్పు ఒప్పుకుంది అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆమె ఈ స్టోరీ పెట్టినట్లు తెలుస్తోంది.
అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


