
📌 Key Points
- సుమ కనకాల రాజీవ్ కనకాలకు ఫోన్ చేసి వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపోజ్ చేయమని కోరారు.
- రాజీవ్ కనకాల స్పీకర్ ఆన్ చేసి మలయాళంలో ప్రపోజ్ చేయగా, సుమ కూడా మలయాళంలోనే రిప్లై ఇచ్చారు.
- లైవ్ లో ఉన్న విషయం తెలియని సుమ ఏదో మాట్లాడబోతుండగా రాజీవ్ స్పీకర్ ఆఫ్ చేశారు.
- సుమ, రాజీవ్ కనకాల ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల ఒక కార్యక్రమంలో సందడి చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రాజీవ్ ను లైవ్ లో ప్రపోజ్ చేయమని కోరగా, సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజీవ్ కనకాలకు సుమ టాస్క్
Anchor Suma:సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ తో క్షణం తీరిక లేకుండా సుమ బిజీబిజీగా ఉన్నారు. ఇక సుమ(Suma) నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక రాజీవ్ కనకాల పలు సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన నటించిన కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సినిమా ఫిబ్రవరి 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రాజీవ్ కనకాల వేదికపై సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు తన లైఫ్ లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక ఇందులో రాజీవ్ కనకాల హీరోయిన్ మానస వారణాసి తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఈయన తెలియజేశారు. ఇక వేదికపై రాజీవ్ కనకాల మాట్లాడుతున్న సమయంలోనే సుమా కనకాలకు ఫోన్ చేసి మీరు మొదటిసారి ఎలా అయితే తనకు ప్రపోజ్ చేశారో అలాగే ప్రపోజ్ చేయాలని చెప్పారు.
స్పీకర్ ఆన్ చేసి ప్రపోజ్ చేసిన రాజీవ్
ఇక రేపు వాలెంటైన్స్ డే కావడంతో యాంకర్ రాజీవ్ కనకాలకు ఇలాంటి టాస్క్ ఇచ్చారు అయితే వేదిక పై నుంచి రాజీవ్ కనకాల సుమకు ఫోన్ చేయడమే కాకుండా స్పీకర్ కూడా ఆన్ చేశారు. ఇలా ఫోన్ చేసిన వెంటనే ఈయన మలయాళంలో తనకు ప్రపోజ్ చేయడంతో సుమ కూడా మలయాళంలోనే రిప్లై ఇచ్చింది. అయితే ఈయన లైవ్ లో ఉన్న విషయం తెలియని సుమా మధ్యాహ్నం నాతో ముద్దు మొహం అంటూ ఏదో చెప్పబోతుండడంతో వెంటనే రాజీవ్ కనకాల స్పీకర్ ఆఫ్ చేసి మొహం చాటేశారు. తాను లైవ్ లో ఉన్నాననే విషయం సుమకు చెప్పడంతో లైవ్ లో ఉండి నాకు ఫోన్ చేసావా నీకు ఉంటుందిలే అంటూ సుమ రాజీవ్ పరువు మొత్తం తీసేస్తూ తనని ఆట పట్టించారు. చివరికి రాజీవ్ ప్రపోజ్ చేయడంతో సుమ మాత్రం నవ్వుతూ పాపం రాజా నీకు ఎంత కష్టం వచ్చింది లైవ్ లో అంటూ ఆట పట్టించారు.
సుమ రాజీవ్ ప్రేమ వివాహం..
సుమ-రాజీవ్ ల ప్రేమ వివాహం
ఇక సుమ కనకాల రాజీవ్ కనకాల ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుమ కేరళ అమ్మాయి అయినప్పటికీ తన తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడిన సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను ఎదుర్కొని తమ వివాహం జరిగిందని సుమా పలు సందర్భాలలో తన ప్రేమ పెళ్లి గురించి తెలియజేశారు. సుమ కెరియర్ మొదట్లో టీవీ ఆర్టిస్టుగా పలు సీరియల్స్ లో నటించారు అనంతరం ఈమె యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు పని చేశారు ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల బుల్లితెర షోలకు దూరంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
మొత్తానికి సుమ, రాజీవ్ కనకాలల మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. వారిద్దరి బంధం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.


