
నటి ఆండ్రియా జెర్మియా ‘మాస్క్’ ప్రమోషన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘వడచెన్నై’లో బలమైన పాత్ర చేసిన తర్వాత తనకు ఆఫర్లు రాలేదని ఆమె తెలిపింది. బలమైన మహిళా పాత్రలు హీరోలకు నచ్చవని, తమిళ చిత్ర పరిశ్రమలో ఇది గమనించానని ఆండ్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది.
Key Points
ఆండ్రియా జెర్మియా నటించిన కొత్త చిత్రం 'మాస్క్' ఈనెల 21న విడుదల కానుంది.
'వడ చెన్నై'లో చంద్ర పాత్రకు ప్రశంసలు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు రాలేదని ఆండ్రియా తెలిపింది.
బలమైన, శక్తివంతమైన మహిళా పాత్రలు తమ సినిమాల్లో ఉండటాన్ని చాలా మంది నటులు అసౌకర్యంగా ఫీల్ అవుతారని ఆమె పేర్కొంది.
తమిళ సినిమాలో ఈ ధోరణిని స్పష్టంగా గమనించానని ఆండ్రియా విచారం వ్యక్తం చేసింది.
ఆండ్రియా జెర్మియా కొత్త చిత్రం ‘మాస్క్’
ఆండ్రియా జర్మియా లేటెస్ట్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మాస్క్’. కవిన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహిస్తుండగా.. ది షో మస్ట్ గో ఆన్, బ్లాక్ మద్రాస్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తను నటించిన ‘వడ చెన్నై’ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘వడచెన్నైలో చంద్రగా నటించిన తర్వాత.. నాకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూవీ తర్వాత నాకు ఎలాంటి సినిమా ఆఫర్లు రాలేదు. అయితే చాలా మంది నటులు తమ సినిమాల్లో బలమైన, శక్తివంతమైన మహిళా పాత్రలు ఉండటాన్ని అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందుకే ఆ సినిమా తర్వాత నాకు వేరే ఆఫర్లు రాలేదు. ఇది నేను తమిళ సినిమాలో స్పష్టంగా గమనించిన విషయం’ అంటూ విచారం వ్యక్తం చేసింది.
‘వడ చెన్నై’ తర్వాత ఆఫర్లు ఎందుకు రాలేదు?
హీరోల ఆసంతృప్తిపై ఆండ్రియా వ్యాఖ్యలు
ఆండ్రియా జెర్మియా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో బలమైన మహిళా పాత్రలపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఆమె అభిప్రాయం ప్రకారం, కొంతమంది నటులు శక్తివంతమైన మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.


