|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aneeth Padda : సినిమాలతో పాటు చదువులోనూ.. అనీత్ పడ్డాపై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్

Published: 10-11-2025, 2:13 PM
Aneeth Padda : సినిమాలతో పాటు చదువులోనూ.. అనీత్ పడ్డాపై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా ‘సైయారా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె రెండో సినిమా ‘శక్తి శాలిని’లో నటిస్తోంది. సినిమా షూటింగ్‌తో పాటు తన డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అనీత్‌ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. నటన, చదువు రెండింటినీ సమన్వయం చేసుకుంటున్న ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Key Points

1

'సైయారా' సినిమాతో బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది అనీత్ పడ్డా.

2

ఆమె నటిస్తున్న రెండో ప్రాజెక్ట్ హారర్ మూవీ 'శక్తి శాలిని'.

4

పొలిటికల్ సైన్స్‌లో బి.ఎ. చదువుతూ నటన, విద్య రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది.

అనీత్ పడ్డా సినీ కెరీర్

‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఫుల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుని వరుస మూవీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇక ఎన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ హీరోయిన్ చదువులో కూడా యాక్టీవ్‌గా ఉన్నట్లు టాక్. అయితే మొదట లవ్ స్టోరీతో ఆకట్టుకున్న అనీత్ ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ఓ హారర్ మూవీతో రాబోతున్నట్లు టాక్. దినేష్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘శక్తి శాలిని’లో అనీత్ పడ్డా హీరోయిన్ కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ 24న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుందని తెలుస్తుండగా.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే తన తన కళాశాల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరు కానుందని టాక్. రాజకీయ శాస్త్రంలో బి.ఎ. చదువుతున్న అనీత్.. ప్రస్తుతం చదువు, నటన రెండింటికీ సమాన శ్రద్ధ చూపుతోందనే వార్తలు వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదువులోనూ ముందున్న అనీత్

అభిమానుల మన్ననలు

అనీత్ పడ్డా నటన, చదువు రెండింటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ అభిమానుల ప్రశంసలు పొందుతోంది. ఆమె అంకితభావం, కృషి అందరికీ ఆదర్శం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.