|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్‌తోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ! నాగ్‌తో నో ఛాన్స్.. సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్?

Published: 18-01-2026, 7:30 AM
వెంకటేష్‌తోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ! నాగ్‌తో నో ఛాన్స్.. సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్?
  • అనిల్ రావిపూడి ఇప్పటివరకు 9 సినిమాలను డైరెక్ట్ చేశారు.
  • ఆయన తన 10వ సినిమాను నాగార్జునతో చేస్తారని వార్తలు వచ్చాయి.
  • అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో ‘సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం’ సినిమా వచ్చింది.
  • ‘సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను వెంకటేష్‌తో చేయనున్నారు. గతంలో నాగార్జునతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెంకటేష్‌తో ‘సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం’ సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి కెరీర్ అద్భుతం

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) పేరు రెండో స్థానంలో ఉంటుంది. రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలను అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈయన సిని కెరియర్ లో 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ తొమ్మిది సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో సినిమా చేయటం కోసం హీరోలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలలోకి అడుగు పెట్టింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపుడి పదవ సినిమా ఏ హీరోతో ఉండబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈయన తన పదవ సినిమాని మరొక స్టార్ హీరో నాగార్జున(Nagarjuna)తో చేయబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేసి అనిల్ రావిపూడి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మిగిలింది నాగార్జున మాత్రమే దీంతో నాగార్జునతో సినిమా ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

నాగార్జునతో సినిమా లేనట్టేనా?

ఈ విధంగా అనిల్ రావిపూడి నాగార్జున కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తన పదవ సినిమా నాగార్జునతో కాదని తిరిగి మళ్లీ వెంకటేష్ తోనే సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి వెంకటేష్ (Venkatesh)కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం…

వెంకటేష్‌తో సీక్వెల్ ప్లాన్

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తన పదవి సినిమాని వెంకటేష్ తో చేయబోతున్నారని ఈ సీక్వెల్ సినిమాకు “సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం” (Sankranthiki Malli Vadtunnam)అని టైటిల్ కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీక్వెల్ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వెంకటేష్ తన పదవ సినిమాని నాగార్జునతో చేయబోతున్నారు అంటూ సంతోషం వ్యక్తం చేసిన అక్కినేని అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. త్వరలోనే అనిల్ రావిపూడి నాగార్జునతో కూడా సినిమా చేయాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.