|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షూటింగ్ స్టార్ట్ కాకముందే సంచలనం! అనిల్ రావిపూడి సినిమాకు అదిరిపోయే డీల్!

Published: 15-04-2026, 8:05 AM
షూటింగ్ స్టార్ట్ కాకముందే సంచలనం! అనిల్ రావిపూడి సినిమాకు అదిరిపోయే డీల్!
  • అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ చిత్రం.
  • షూటింగ్ ప్రారంభానికి ముందే జీ 5 ఓటీటీ ద్వారా డిజిటల్ హక్కులు కొనుగోలు.
  • కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి, వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటించే అవకాశం.
  • సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం.

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే జీ 5 సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.

అనిల్ రావిపూడి కొత్త సినిమా వివరాలు

Anil Ravipudi: టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్లాక్ బాస్టర్ అందుకుంటున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ అంటూ మరో బ్లాక్ బస్టర్ సినిమాని సొంతం చేసుకున్నారు. ఇక 2027 సంక్రాంతి పండుగను కూడా అనిల్ రావిపూడి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి తన కెరియర్ లో పదవ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోలుగా నటించబోతున్నారు. మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు. ఈ సినిమా సగభాగం స్క్రిప్ట్ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి(Kriti Shetty) కళ్యాణ్ రామ్ జోడిగా కనిపించబోతున్నట్లు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఇక వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన వెలువబడలేదు.

ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన జీ 5

ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ , షైన్ స్క్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా తాజాగా అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం హిట్ అనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈయన ప్రస్తుతం దర్శకత్వం వహించబోతున్న సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే ఓటీటీ డీల్ పూర్తి అయిందని తెలుస్తోంది.

జీ 5 చేతికి అనిల్ రావిపూడి సినిమా డిజిటల్ రైట్స్..

చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5(Zee 5) ఫాన్సీ ధరలకు కైవసం చేసుకున్నారని సమాచారం. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా పట్ల వచ్చిన బజ్ కారణంగా సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది కానీ అనిల్ రావిపూడి సినిమాకు మాత్రం విభిన్నంగా షూటింగ్ ప్రారంభం కాకుండానే కేవలం ఆయన పై నమ్మకంతో భారీ ధరలకు ఓటిటి రైట్స్ దక్కించుకోవడం అంటే అనిల్ రావిపూడి క్రేజ్ ఏంటో స్పష్టమవుతుంది. ఇప్పటివరకు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి బరిలో మరో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం కాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం ఆయన క్రేజ్ ఏమిటో చూపిస్తుంది. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.