|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి, వెంకీ మ్యాజిక్ రిపీట్! బడా బ్యానర్ల అండతో సెట్స్ మీదకు!

Published: 17-02-2026, 5:35 AM
అనిల్ రావిపూడి, వెంకీ మ్యాజిక్ రిపీట్! బడా బ్యానర్ల అండతో సెట్స్ మీదకు!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా తెరకెక్కనుంది.
  • ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
  • ఉగాది పండుగ సందర్భంగా సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
  • అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో ఇదివరకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు వచ్చాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా

Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రతి ఏడాది ఒక సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అపజయం ఎరుకొని దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. పటాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన కెరీర్ లో 9 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఈ తొమ్మిది సినిమాల ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక తన పదవ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ రావిపూడి తన పదవి సినిమాని ఏ హీరోతో చేయబోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అనిల్ రావిపూడి తన పదవి సినిమాని మరోసారి విక్టరీ వెంకటేష్ తో(Venkatesh) చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుకూలంగానే వెంకటేష్ కూడా మళ్లీ సంక్రాంతికి వస్తాం ధనాధన్ ఇచ్చేస్తామంటూ మాట్లాడటంతో వీరిద్దరి కాంబో ఫిక్స్ అయిందని అర్థమవుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం బడా బ్యానర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనిల్ అనిల్ రావిపూడితో షైన్ స్క్రీన్ (Shine Screen)వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకుంటున్నారు.

నిర్మాణంలో బడా బ్యానర్లు

ఈ నేపథ్యంలోనే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకి కూడా షైన్ స్క్రీన్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది ఇక ఈ బ్యానర్ తో పాటు సురేష్ ప్రొడక్షన్(Suresh Production) బ్యానర్ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇలా ఈ రెండు బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

క్యామియో పాత్రలో వెంకటేష్..

ఉగాదికి అధికారిక ప్రకటన

అనిల్ రావిపూడి తన పదవి సినిమాకి సంబంధించి ఉగాది పండుగను పురస్కరించుకొని అధికారకంగా ప్రకటన చేయబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. మరి ఈయన ఈసారి ఏ జోనర్ లో సినిమా చేయబోతున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి, వెంకటేష్‌ల కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.