
అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఆయన 10 టీవీతో మాట్లాడుతూ చిరంజీవి సినిమా టైటిల్, భగవంత్ కేసరి సీక్వెల్ గురించి వివరించారు.
Key Points
చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఆగస్టు 22న ప్రకటన
భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు లభించింది
అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సీక్వెల్ గురించి మాట్లాడారు
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటన
చిరంజీవి సినిమా టైటిల్ ప్రకటన
Anil Ravipudi : అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా నేడు 71వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి 10 టీవీతో మాట్లాడుతూ భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్ చేసారు. అలాగే చిరంజీవి సినిమా టైటిల్ గురించి తెలిపారు.
భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఒక మంచి కథని చెప్పాం. అది అందరికి రీచ్ అయింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డు కూడా రావడం ఆనందంగా ఉంది. భగవంత్ కేసరి సీక్వెల్ గురించి ఇప్పటిదాకా అనుకోలేదు. ఛాన్స్ ఉంటే కచ్చితంగా చేస్తాను అని తెలిపారు.
భగవంత్ కేసరి సీక్వెల్ అవకాశాలు
అలాగే చిరంజీవితో తీస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజుకు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అని తెలిపారు. గతంలో అనిల్ – చిరంజీవి సినిమాకు మన శంకర వర ప్రసాద్ అనే టైటిల్ వినిపించింది. అదే టైటిల్ అనౌన్ చేస్తారా లేక ఏదైనా కొత్త టైటిల్ ప్రకటిస్తారా చూడాలి.
చిరంజీవి సినిమా టైటిల్‌కు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆగస్టు 22 ఒక ముఖ్యమైన రోజు కానుంది. భగవంత్ కేసరి సీక్వెల్ గురించి అనిల్ రావిపూడి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


