|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anupam Kher: “తన్వి ది గ్రేట్” కీలక పోస్టర్ విడుదల

Published: 13-05-2025, 8:39 AM
Anupam Kher: "తన్వి ది గ్రేట్" కీలక పోస్టర్ విడుదల

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తన్వి ది గ్రేట్” చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Key Points

1

అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో వస్తున్న "తన్వి ది గ్రేట్" సినిమాకు కొత్త పోస్టర్ విడుదల.

2

అనుపమ్ ఖేర్ కల్నల్ ప్రతాప్ రైనా పాత్రలో నటిస్తున్నారు.

4

శుభంగి దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి కూడా నటిస్తున్నారు.

కల్నల్ ప్రతాప్ రైనా పాత్రలో అనుపమ్ ఖేర్

బాలీవుడ్ సీనియర్ నటుడు.. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రేక్షకులు, అభిమానుల్ని నవ్వించి, ఏడిపించి, ఉత్సాహపరిచిన అనుపమ్ ఖేర్ (Anupam Kher) దర్శకత్వంలో రాబోతోన్న సినిమా “తన్వి ది గ్రేట్” (Tanvi The Great). ఇది కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా. శుభంగి (Shubangi Datt) ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అనుపమ్ ఖేర్ స్టూడియోస్, ఎన్ఎఫ్‌డిసి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

“తన్వి ది గ్రేట్”లో అనుపమ్ ఖేర్ కల్నల్ ప్రతాప్ రైనా (Col Pratap Raina) పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాను రాసిన కథలో తానే కల్నల్ పాత్ర పోషిస్తున్నట్లు అనుపమ్ తన ఇన్ స్టా హ్యాండిల్‌లో రాసుకొచ్చారు. “అతను తన మాటల కంటే తన మౌనాన్ని బిగ్గరగా మాట్లాడనిస్తాడు. కానీ అప్పుడు ఎవరో అతని ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. నిశ్శబ్దం గురించి తనదైన వివరణ ఉన్న వ్యక్తి. పరిస్థితులు ఈ రెండు శక్తుల్ని కలిపినపుడు వారి ప్రపంచం కొద్దిగా వణుకుతుంది. కొన్నిసార్లు అది మిమ్మల్ని నవ్విస్తుంది. కొన్నిసార్లు ఏడిపిస్తుంది. అయినప్పటికీ కల్నల్ ప్రతాప్ రైనా, తన్వి.. ఒక నాణేనికి ఇరువైపులా ఉంటారు” అని అనుపమ్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇటీవలే నాజర్ పాత్ర బ్రిగేడియర్ రావును పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ నటుడు కరణ్ టాకర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

“తన్వి ది గ్రేట్” సినిమా అప్డేట్

కీలక నటీనటులు

మొత్తానికి, “తన్వి ది గ్రేట్” సినిమా పోస్టర్ విడుదలతో అభిమానుల ఆసక్తి పెరిగింది. సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.