|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కథనార్’ ట్రైలర్ విధ్వంసం: అనుష్క శెట్టి మాయాజాలం! హాలీవుడ్ దిమ్మతిరిగే VFX!

Published: 31-03-2026, 6:05 AM
‘కథనార్’ ట్రైలర్ విధ్వంసం: అనుష్క శెట్టి మాయాజాలం! హాలీవుడ్ దిమ్మతిరిగే VFX!
  • అనుష్క శెట్టి, జయ సూర్య నటించిన మలయాళ చిత్రం ‘కథనార్’.
  • ట్రైలర్ విడుదల.. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్!
  • డార్క్ విజువల్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ.
  • ఫ్రెష్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ వీఎఫ్ఎక్స్ పరంగా హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథనార్ ట్రైలర్: వీఎఫ్ఎక్స్ అద్భుతం

Anushka Shetty:అనుష్క శెట్టి.. అరుంధతి, భాగమతి వంటి విభిన్నమైన చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ కథలతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు రుద్రమదేవి, బాహుబలి 2 లాంటి చిత్రాలతో రాజసం ఉట్టిపడే పాత్రలు పోషించి ఆకట్టుకుంది. అంతేకాదు బిల్లా, సూపర్ వంటి చిత్రాలతో గ్లామర్ వలకబోసి ఆకట్టుకున్న ఈ చిన్నది తాజాగా మలయాళం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుష్క శెట్టి హీరోయిన్ గా , జయ సూర్య హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం కథనార్: ది వైల్డ్ సోర్సెరర్.. రోజన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ ను తెలుగులో తాజాగా విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన కథనార్ ట్రైలర్ చూసిన నెటిజన్స్ ఆ వీఎఫ్ఎక్స్ ఏంటి భయ్యా .. సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారా ఏంటి ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ట్రైలర్ విషయానికి ట్రైలర్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా డార్క్ అండ్ రిచ్ విజువల్స్ తో చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతుంది. ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్ర బృందం పడ్డ కష్టం మనకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. సినిమాను చూసే ఆడియన్స్ ను మరో కొత్త మాయాజాలంలోకి తీసుకెళ్తోంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ పనితనం, ఈ మిస్టరీ కథకు ప్రాణం పోసింది. సాధారణంగా ఇండియన్ సినిమాలలో వీఎఫ్ఎక్స్ విషయంలో ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ కథనార్ మాత్రం ఈ విఎఫ్ఎక్స్ విషయంలోనే అందర్నీ నోరెళ్ళబెట్టేలా చేసింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో ఖచ్చితమైన స్పష్టమైన సిజీఐ వర్క్ చాలా క్లీన్ గా సహజంగా కనిపించడంతో ప్రేక్షకుడు ప్రతి విజువల్ కి ఆకర్షితుడు అవుతున్నాడు.

సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్స్

సినిమాటోగ్రాఫిక్ విషయంలో కూడా అతిగా ఉంది అనే భావన కలగకుండా కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చిత్ర బృందం చేసింది. అటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది పైగా కథనార్ కథాంశం చాలా ఫ్రెష్ గా కొత్తగా అనిపిస్తోంది . ఒక రొటీన్ మాంత్రికుడి కథలా కాకుండా వైవిద్యమైన స్క్రీన్ ప్లే తో ఈసినిమా సాగనుంది అనిపిస్తోంది. భారతీయ జానపద కథలకు ఆధునిక సాంకేతిక జోడించి మలయాళ మేకర్స్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం నిజంగా సూపర్ హిట్ విజయాన్ని అందిస్తుందని అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్లో అనుష్క శెట్టి లుక్ , జయ సూర్య గెటప్ , ప్రభుదేవా పర్ఫామెన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

“విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా కాంతూరు శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు..” అంటూ డైలాగ్ తోనే ప్రేక్షకుడిని ఒక సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్ళింది చిత్ర బృందం. ఇలా ఈ సినిమాలోని ప్రతి షాట్ కూడా ప్రేక్షకుడికి కన్నుల విందుగా ఉంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే అనుష్క శెట్టి మలయాళ డెబ్యూ మూవీ తో నిజంగానే సూపర్ సక్సెస్ అందుకోబోతోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి

భారీ అంచనాలతో ‘కథనార్’

మొత్తానికి ‘కథనార్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విభిన్నమైన కథాంశంతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రం అనుష్క శెట్టికి మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.