
📌 Key Points
- రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందింది.
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టారు.
- టీడీపీ ఎంపీ మస్తాన్ రావు యాదవ్ బిల్లుకు మద్దతు తెలిపారు.
- అమరావతి రాజధానిగా ఎంపిక చేయడానికి గల కారణాలను ఎంపీ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతి రాజధాని కావడం దాదాపు ఖాయమైనట్లే.
రాజ్యసభలో బిల్లు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది.
గురువారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటుంది. ‘వికసిత్ భారత్’ సాధించడంలో ప్రధాని నరేంద్ర మోదీ కల మరియు సంకల్పాన్ని నెరవేర్చడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తున్నాము” అని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అన్నారు.
కేంద్రమంత్రి ప్రకటన
బిల్లుకు మద్దతు తెలుపుతూ టీడీపీ ఎంపీ మస్తాన్ రావు యాదవ్ మాట్లాడారు. చాలా ప్రణాళికల తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వివరించారు. టీడీపీ సభ్యుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా పలువురు సభ్యులు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు.
టీడీపీ మద్దతు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వేచి చూడాలి.


