
📌 Key Points
- స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.
- విశాఖ, విజయనగరం, గుంటూరు జిల్లాలు స్వచ్ఛాంధ్రలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
- గ్రామీణ, పట్టణ డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చాలని సీఎం సూచన.
స్వచ్ఛాంధ్రను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, కొత్త పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడం, డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చడం వంటి చర్యలను ఆయన సూచించారు.
స్వచ్ఛాంధ్రపై సీఎం సమీక్షా సమావేశం
స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
క్యాంపు కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఈ ఏడాది మార్చి 31 వరకు రూపొందించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకులను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు జిల్లాలు స్వచ్ఛాంధ్రలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా… శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇందులో విశాఖ జిల్లాకు 92 శాతం, విజయనగరం, గుంటూరు జిల్లాలకు 85 శాతం మార్కులు వచ్చాయన్నారు.
‘అట్టడుగున ఉన్న ఏఎస్ఆర్ జిల్లాకు కేవలం 53 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. డోర్ టు డోర్ కలెక్షన్, తడి చెత్త-పొడి చెత్త వేరు చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఓడీఎఫ్ ప్లస్ మోడల్ వంటివి ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నట్టు చెప్పారు.. అయితే ఇకపై జిల్లాలకు స్వచ్ఛాంధ్ర ర్యాంకులు థర్డ్ పార్టీ ఇచ్చేలా చూడాలి.’ అని సీఎం సూచించారు.
మున్సిపాలిటీల్లో కొత్త టాయిలెట్ల నిర్మాణం
మున్సిపాలిటీ ల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నిర్ణీత పరిధిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేలా చూడాలన్నారు. గతంలో వ్యర్థాలతో నిండిపోయిన డంపింగ్ యార్డుల్లో… ప్రస్తుతం చెత్త క్లియర్ చేయడంతో పాటు ఆయా స్థలాలను పచ్చదనంతో నింపేలా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణానికి సమీపంలో ఉన్న డంపింగ్ కేంద్రాలను ముందుగా పార్కులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
2024 జూన్ నుంచి నేటి వరకు పట్టణాల్లో 153 లక్షల టన్నుల చెత్తకు గాను, 114 లక్షల టన్నుల చెత్త తొలగించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ జూన్ కల్లా 100 శాతం క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో పేరుకు పోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్త ప్రాసెసింగ్ కూడా 100 శాతం జరగాలన్నారు.
కంపోస్ట్ మార్కెటింగ్ చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. మ్యాజిక్ డ్రెయిన్లకు అనుసంధానంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ తీసుకురావడం ద్వారా మురుగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహద పడుతుందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, నెట్ జీరో, గ్రీనరీ పెంపు, క్లీన్-హైజీన్ కిచెన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. గాలి నాణ్యత పర్యవేక్షణకు ప్రస్తుతమున్న 83 ప్రాంతాలతో పాటు, అదనంగా 53 మాన్యువల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
డంపింగ్ యార్డుల రూపాంతరణకు ప్రణాళికలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు, ఈ వేస్ట్ కలెక్షన్‌కు సంబంధించి అమలు చేస్తున్న విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నామని, గోబర్ ధన్ యూనిట్లు, గ్రీన్ షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నామని అధికారులు తెలిపారు. మురుగు నీటి నిర్వహణలో కూడా సమూల మార్పులు తెస్తున్నామని… గ్రే వాటర్, బ్లాక్ వాటర్ నిర్వహణకు భారీ ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించారు. పొడి చెత్తను సేకరించే గ్రీన్ షాపులకు స్వచ్ఛ రథం ఏజెన్సీ నుంచి, పంచాయతీ నుంచి సాయం అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ కల్లా గోబర్ ధన్ ప్లాంట్లు సిద్ధం అవుతాయని వెల్లడించారు. అలాగే ‘స్వచ్ఛ పథం’ పేరుతో గ్రామీణ రోడ్ల శుభ్రత కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
10 జిల్లాల్లో 590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పట్టణాల్లో 2024-2026 మధ్య గ్రీన్ స్పేస్ పార్కులు 57 అభివృద్ధి చేసినట్టు వివరించారు. మరో 284 గ్రీన్ స్పేస్ పార్కులు, 100 స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అధికారులు తెలపగా, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు సోక్ పిట్స్, కిచెన్ గార్డెన్స్, మ్యాజిక్ డ్రెయిన్స్ వంటి విధానాలు అవలంభిస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా… 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, 1 లక్ష సోక్ పిట్స్, 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కి.మీ. మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా తీసుకున్న చర్యలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిద్దాం. ఈ కార్యక్రమాల విజయవంతం అందరి బాధ్యత.


