
📌 Key Points
- ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
- లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం ముందుగా జరుగుతుంది.
- ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
- ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం ఎప్పుడు?
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 24వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ రంజాన్ సెలవు 21వ తేదీకి మారటంతో… ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షలను మార్చి 25వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ మార్చి 22వ తేదీ నుంచి షురూ కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ముందుగా లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, మరియు ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం జరగనుంది. వీటితో పాటు స్పెల్-1 కింద వచ్చే ఒకేషనల్ సబ్జెక్టుల పేపర్లను కూడా అదే రోజున పూర్తి చేస్తారు. మిగతా సబ్జెక్టులను స్పెల్స్ వారీగా పూర్తి చేస్తారు.
ఏప్రిల్ లోనే ఫలితాలు విడుదల?
ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఏపీ ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా 10వ తేదీలోపే రిలీజ్ చేేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పాట్ పూర్తి కాగానే… సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అయిన తర్వాత… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. అధికారికంగా ఓ తేదీని ప్రకటిస్తారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్ రెండో వారంలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్ రిజల్ట్, సెకండిర్ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాల తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.


