|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రంజాన్ సెలవు గందరగోళం! APలో టెన్త్ పరీక్ష వాయిదా, విద్యార్థుల్లో ఆందోళన!

Published: 19-03-2026, 10:35 PM
రంజాన్ సెలవు గందరగోళం! APలో టెన్త్ పరీక్ష వాయిదా, విద్యార్థుల్లో ఆందోళన!
  • రంజాన్ సెలవును ఈనెల 20 నుండి 21వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు సెలవు మార్పు జరిగింది.
  • పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడింది.
  • రంజాన్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ సెలవు తేదీని మార్చింది. ఈ నెల 20వ తేదీ బదులు 21వ తేదీన సెలవు ప్రకటించింది. దీని కారణంగా పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష తేదీని కూడా మార్చవలసి వచ్చింది.

రంజాన్ సెలవులో మార్పులు

రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓ ఆర్టీ సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగింది.

అయితే శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు ఆయన వెల్లడించారు. 20వ తేది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని సీఎస్ స్పష్టం చేశారు.

పదో తరగతి పరీక్షల వాయిదా

అదే విధంగా షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881కు అనుగుణంగా రంజాన్ సాధారణ సెలవు ను 20వ తేది శుక్రవారానికి బదులుగా 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓఆర్టి సంఖ్య:613 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంజాన్ సెలవు మార్పు కావడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారింది. ఈ నెల 21వ తేదీన జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. మెుదట ఈ నెల 20వ తేదీ శుక్రవారం షెడ్యూల్ ప్రకారం జరగాలి. కానీ ఈనెల 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 21వ తేదీ శనివారానికి మార్చారు. కానీ ప్రభుత్వం మార్చి 21ని సెలవు దినంగా మార్చడంతో పరీక్షలు అన్ని ముగిసిన తర్వాత.. ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు

ఇక శుక్రవారం.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలుయథావిధిగా పనిచేస్తాయి.

ఈ మార్పుల నేపథ్యంలో విద్యార్థులు గమనించి, పరీక్షకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.