
📌 Key Points
- గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ తిరుచిరాపల్లి (అరుణాచలం) వరకు పొడిగింపు.
- భక్తుల మూడేళ్ల డిమాండ్‌ను నెరవేర్చిన రైల్వే శాఖ.
- కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవ.
- ఏపీ నుంచి తమిళనాడు పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సులభతరం.
ఆంధ్రప్రదేశ్ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని తిరుచిరాపల్లి (అరుణాచలం) వరకు పొడిగించారు. కేంద్ర మంత్రుల చొరవతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ నిర్ణయంతో ఏపీ నుంచి తమిళనాడు పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సులభతరం కానుంది.
గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ పొడిగింపు
Guntur Tirupati Train Extension : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేరుస్తూ…. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
ఈ రైలును తిరువణ్ణామలై ( అరుణాచలం ) వరకు పొడిగించాలని గత మూడేళ్లుగా భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగా సాగిన నిరంతర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్….. వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు ఈ రైలును నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
భక్తుల చిరకాల కోరిక నెరవేరింది
ఈ పొడిగింపు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నంద్యాల, కడప మీదుగా ప్రయాణించే ఈ రైలు ద్వారా భక్తులు ఇప్పుడు ఒకే ప్రయాణంలో పలు ప్రధాన క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఈ రూట్ పొడిగింపు వల్ల కేవలం యాత్రికులకే కాకుండా….. ఉపాధి నిమిత్తం తమిళనాడు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా ఎంతో వెసులుబాటు కలుగుతుంది. నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ భక్తులకు ప్రయాణ కష్టాలు దూరం
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ రైలు పొడిగింపుతో ఏపీ భక్తులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. సమయం, ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, ఆధ్యాత్మిక యాత్రలు మరింత సులువుగా మారతాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజానుకూల నిర్ణయంగా నిలుస్తుంది.


