|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Apoorva Charan: హాలీవుడ్‌లో తెలుగు మహిళ ప్రొడ్యూసర్ ఘనత..

Published: 07-06-2025, 11:45 AM
Apoorva Charan: హాలీవుడ్‌లో తెలుగు మహిళ ప్రొడ్యూసర్ ఘనత..

హాలీవుడ్‌లో తెలుగు మహిళ అపూర్వ చరణ్ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఆమె తాజా విజయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

అపూర్వ చరణ్ నిర్మించిన ‘జాయ్ ల్యాండ్’ ఆస్కార్ బరిలో షార్ట్ లిస్ట్ అయింది.

2

‘టేక్ మీ హోమ్’ చిత్రానికి ట్రిబెకా ఫెస్టివల్ ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కేటాయించింది.

4

‘టేక్ మీ హోమ్’ 2026లో ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్ అవుతుంది.

అపూర్వ చరణ్ యొక్క హాలీవుడ్ ప్రయాణం

హాలీవుడ్‌(Hollywood)లో తన ఘనత చాటుకుంటూ దూసుకుపోతోంది ఓ తెలుగు మహిళ అపూర్వ చరణ్. హైదరాబాద్‌లో పుట్టిన అపూర్వా చరణ్ క్యాలిఫోర్నియాలో సెటిల్ అయ్యి.. అక్కడ ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఇప్పటికే ఆమె నిర్మించిన పాకిస్థానీ సినిమా ‘జాయ్ ల్యాండ్’ ఆస్కార్ బరిలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అవడం విశేషం. అలాగే.. ఈ మూవీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ పురష్కారాలను కూడా కైవసం చేసుకుంది. ఇలా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అపూర్వా తాజాగా మరో ఘనత సాధించింది. ఈమె ప్రజెంట్ నిర్మిస్తున్న చిత్రం ‘టేక్ మీ హోమ్’.

లిజ్ సార్జంట్ దర్శకత్వం వహించిన ఈ ఫీచర్ ఫిల్మ్‌ను 2025 ట్రిబెకా ఫెస్టివల్ AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రీన్ లైట్ కమిటీ అధికారికంగా ఎంపిక చేసింది. దీంతో ఈ ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఏకంగా ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కేటాయించింది. అంటే దాదాపు 8 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్ మనీగా పేరుగాంచిన ట్రిబెకా ఫెస్టివల్‌లో హాలీవుడ్‌లో మహిళా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న తెలుగు మహిళ అపూర్వ చరణ్, డైరెక్టర్ లిజ్ సార్జంట్ ఫీచర్ ఫిల్మ్ ‘టేక్ మీ హోమ్’ ఈ ఘనత సాధించడంతో ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్‌గా మారింది. కాగా.. ‘టేక్ మీ హోమ్’ ఫీచర్ ఫిలిమ్ వచ్చే ఏడాది (2026) ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యేందుకు సిద్ధం కానుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మానసిన అంగవైకల్యం ఉన్న ఓ కొరియన్ మహిళా (38) తన వృద్ధాప్య తల్లిదండ్రులను ఎలా చూసుకుంటుంది.. ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది అనేది స్టోరీ.

‘జాయ్ ల్యాండ్’ మరియు ‘టేక్ మీ హోమ్’ చిత్రాల విజయం

ట్రిబెకా ఫెస్టివల్ అవార్డు

అపూర్వ చరణ్ సాధించిన విజయాలు తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులను ఎదురుచూస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.