|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘అరి’.. ఆ ఇద్దరికి అంకితం : దర్శకుడు ఎమోషనల్‌ పోస్ట్‌

Published: 09-10-2025, 8:37 AM
‘అరి’.. ఆ ఇద్దరికి అంకితం : దర్శకుడు ఎమోషనల్‌ పోస్ట్‌

దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జయశంకర్ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి, బావగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Key Points

1

'అరి' చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది, దర్శకుడు జయశంకర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

2

జయశంకర్ తన తండ్రి, బావగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపారు.

4

'అరి' కథ కోసం జయశంకర్ ఏడేళ్ల పాటు కృషి చేసి, హిమాలయాలకు కూడా వెళ్లారు.

‘అరి’ మూవీ: విడుదల, నటీనటులు

పేపర్ ‌ బాయ్ ‌ తర్వాత దర్శకుడు జయశంకర్ ‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ అరి ’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు ( అక్టోబర్ ‌ 10) న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ ‌ ఇన్ ‌ స్టాలో ఓ ఎమోషనల్ ‌ పోస్ట్ ‌ పెట్టాడు .

దర్శకుడు జయశంకర్ భావోద్వేగ లేఖ

‘ అరి ’ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది . ఈ మూవీ తెరకెక్కించే సమయంలోనే నా జీవితానికి మూల స్థంబాలుగా ఉన్న మా నాన్న , బావగారిని కోల్పోయాను . అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను . ఇక రేపటి నుంచి ఈ చిత్రం మీ ( ఆడియన్స్ ‌) సొంతం ’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు .

‘అరి’ కథ కోసం ఏడేళ్ల ప్రయాణం

‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాలకు కూడా వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిసి అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు .

ఏడేళ్ల పాటు అరి సినిమా కథ కోసం జయశంకర్ చేసిన కృషి, ఆధ్యాత్మిక నేపథ్యం, ఆయన భావోద్వేగ ప్రకటన సినిమాపై అంచనాలను పెంచుతోంది. రేపు విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.