
📌 Key Points
- అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫోటోతో సోషల్ మీడియాలో భారీ సంచలనం, అందరికీ షాక్.
- బిగ్ బాస్ ఫేమ్ నటుడితో వెబ్ సిరీస్ షూటింగ్ కోసం అషు రెడ్డి రింగ్ మార్పిడి నాటకం.
- 9 కోట్ల మోసం ఆరోపణల తర్వాత ఈ ఎంగేజ్మెంట్ వార్త మరింత చర్చనీయాంశం.
- నెటిజన్ల ఆగ్రహం: అషు రెడ్డి అందర్నీ మోసం చేసిందని తీవ్ర విమర్శలు.
తెలుగు సినీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్! ఎప్పుడూ వార్తల్లో ఉండే అషు రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఎంగేజ్మెంట్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నాటకం వెనుక అసలు నిజం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం!
అషు రెడ్డి ఎంగేజ్మెంట్: నిజమా.. నాటకమా?
తెలుగు యాంకర్ అషురెడ్డి పేరు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అషురెడ్డి తన కుమారుడిని మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని కారు, బంగ్లాలు కొనిపించి దాదాపు 9 కోట్లు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అషు రెడ్డితో పాటు ఆమె తల్లి, అక్క కలిసి తమ కుమారుడిని ట్రాప్ చేశారని ఆరోపించాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన కుమారిడిని డబ్బు కోసం వాడుకుంటూ మరొకరితో అషు రిలేషన్ షిప్ లో ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తరవాత అషురెడ్డి బాధితుడితో మాట్లాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆడియోలో డబ్బులు ఇవ్వను అంటూ అషురెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టు కనిపించింది. ఇది జరిగిన తరవాత రెండు రోజుల క్రితం అషు తన ఎంగేజ్మెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో రింగ్ ఫోటోను షేర్ చేసి మరో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో తాను రిలేషన్ లో ఉన్న మరో వ్యక్తితో అషురెడ్డి వివాహం జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ అది ఫేక్ ఎంగేజ్మెంట్ అని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. హాట్ స్టార్ లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సీన్ కోసం అషురెడ్డి ఉంగరాలు మార్చుకుంది. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు, అషురెడ్డి కాంబినేషన్ లో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. ఇక ప్రస్తుతం వీరిద్దరి వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అషురెడ్డి అందర్నీ గొర్రెల్ని చేసిందిగా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
9 కోట్ల మోసం ఆరోపణల తర్వాత బిగ్ ట్విస్ట్!
వెబ్ సిరీస్ కోసమేనా ఈ స్టంట్?
అషు రెడ్డి సృష్టించిన ఈ సంచలనం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. వెబ్ సిరీస్ కోసం ఎంత సాహసం చేసిందో చూడాలి! మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు, అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!


