|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Assistant Director: షూటింగ్‌లో తీవ్ర విషాదం.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కన్నుమూత

Published: 24-08-2025, 12:46 AM
Assistant Director: షూటింగ్‌లో తీవ్ర విషాదం.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కన్నుమూత

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ఎమిలీ ఇన్ పారిస్’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో విషాదం చోటుచేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా హఠాన్మరణం చెందారు. ఇటలీలోని వెనిస్‌లో జరుగుతున్న షూటింగ్‌ను నిలిపివేశారు.

Key Points

1

ఇటలీలోని వెనిస్‌లో 'ఎమిలీ ఇన్ పారిస్' షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

2

అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా హఠాన్మరణం చెందారు.

4

వైద్య సిబ్బంది ప్రయత్నాలు ఫలించకపోవడంతో షూటింగ్ నిలిపివేశారు.

వెనిస్‌లో షూటింగ్ సమయంలో విషాదం

హార్ట్ ఎటాక్ ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో గుబులే . వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది . ఈ సమస్య మనదేశంలోనే కాదు .. ప్రపంచవ్యాప్తంగానూ అందరినీ వేధిస్తోంది . కారణం ప్రస్తుత జనరేషన్ జీవనశైలి మార్పులే కారణం కావొచ్చు . తాజాగా హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా షూటింగ్ స్పాట్ ‌ లోనే కన్నుమూశారు .

ప్రముఖ ఓటీటీ నెట్ ‌ ఫ్లిక్స్ ‌ రూపొందిస్తున్న ఎమిలీ ఇన్ పారిస్ వెబ్ సిరీస్ ‌ ఐదో సీజన్ ‌ కు డియోగో బోరెల్లా అసిస్టెంట్ ‌ డైరెక్టర్ ‌ గా పనిచేస్తున్నారు . ప్రస్తుతం ఈ సిరీస్ ‌ షూటింగ్ ‌ ఇటలీలోని వెనిస్ ‌ నగరంలో జరుగుతోంది . ఈ ఘటన ఆగస్టు 21 గురువారం సాయంత్రం జరిగింది . సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను కుప్పకూలిపోవడంతో సెట్‌లోని వైద్య సిబ్బంది బతికించడానికి ప్రయత్నించారు . కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు . అసిస్టెంట్ ‌ డైరెక్టర్ ‌ మృతితో షూటింగ్ ‌ ను నిలిపేశారు . కాగా .. ‘ ఎమిలీ ఇన్ పారిస్’ సీజన్ – 5 డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

అసిస్టెంట్ డైరెక్టర్ హఠాన్మరణం

షూటింగ్ నిలిపివేత

డియోగో బోరెల్లా మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ‘ఎమిలీ ఇన్ పారిస్’ షూటింగ్ నిలిచిపోయింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.