
📌 Key Points
- ప్రతిరోజూ 1% మెరుగుదల ఉంటే, ఏడాదికి 37 రెట్లు అభివృద్ధి చెందవచ్చు.
- విజేతలు, ఓడినవారు ఇద్దరికీ లక్ష్యాలు ఒకటే, కానీ వారి సిస్టమ్స్‌లో తేడా ఉంటుంది.
- సిస్టమ్ అంటే మన దినచర్యలో మనం చేసే అలవాట్లు.
- ఏ అలవాటైనా మెదడులో క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అనే నాలుగు దశల ద్వారా వెళ్తుంది.
చాలామంది జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలని కోరుకుంటారు. అయితే, చిన్న చిన్న అలవాట్లతోనే అద్భుతాలు సృష్టించవచ్చని ‘అటామిక్ హ్యాబిట్స్’ రచయిత జేమ్స్ క్లియర్ అంటున్నారు. మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.
అటామిక్ అంటే ఏమిటి? శక్తి ఎంత?
చాలామంది జీవితంలో మార్పు కోసం పరితపిస్తుంటారు. ఏదో ఒక అద్భుతం జరగాలని, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని లేదా ఒక్క రోజులోనే సిక్స్ ప్యాక్ వచ్చేయాలని ఆశిస్తుంటారు. కానీ అద్భుతం అనేది మనం అలవాట్లలో ఉంటుందని అంటున్నారు ప్రపంచ ప్యఖ్యాత ‘అటామిక్ హ్యాబిట్స్’ రచయిత జేమ్స్ క్లియర్. మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పని.. మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటున్నారు. వీటిని తన పుస్తకంలో మరింత లోతుగా వివరించారు.
ఈ పుస్తకం కేవలం “అలవాట్లు మార్చుకోండి” అని చెప్పదు, మన మెదడు ఎలా పనిచేస్తుంది? మనిషి జీవితంలో అలవాటు అనేది ఎంత కీలకం? ఒక అలవాటు మన గుర్తింపును ఎలా మారుస్తుంది? అనే అంశాలను శాస్త్రీయంగా వివరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ అద్భుతమైన పుస్తకంలోని లోతైన విశ్లేషణను చూద్దాము..
1. అటామిక్ అంటే ఏంటి? 1% శక్తి ఎంత?
‘అటామిక్’ అంటే అణువు అని అర్థం. అంటే చాలా చిన్నది కానీ అపారమైన శక్తి కలిగినది! జేమ్స్ క్లియర్ ఏమంటారంటే, మీ అలవాట్లు కూడా అణువుల వలె చిన్నవిగా ఉండాలి.
ఆయన ప్రకారం.. మనం ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడితే చాలు! అదే జరిగితే ఏడాది చివరకి మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి కంటే 37 రెట్లు మెరుగైన వ్యక్తిగా మారుతాము. దీనికి విరుద్ధంగా, ప్రతిరోజూ 1% దిగజారితే, ఏడాది ముగిసేసరికి మన సామర్థ్యం సున్నాకి చేరుకుంటుంది. దీనినే ‘మార్జినల్ గెయిన్స్’ అంటారు.
2. గోల్స్ వర్సెస్ సిస్టమ్స్
మనం ఎప్పుడూ లక్ష్యాల మీద దృష్టి పెడతాం. అది చేసేయాలి, ఇది చేసేయాలని కలలు కంటాము. కానీ ఈ పుస్తకంలో రచయిత ఒక షాకింగ్ నిజాన్ని చెప్పారు.
“విజేతలకు, పరాజితులకు లక్ష్యాలు ఒకేలా ఉంటాయి.”
తేడా వారి ‘సిస్టమ్’ లో ఉంది. గోల్ అనేది మీరు చేరుకోవాల్సిన గమ్యం అయితే, సిస్టమ్ అనేది మీరు ప్రతిరోజూ నడిచే దారి.
మరి సిస్టమ్ అంటే ఏంటి? మన రోజు అలవాట్లే! గోల్డ్ మెడల్ సాధించేందుకు అథ్లెట్ అనే వాడు ఉదయాన్నే లేవాలి, బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలి, సరైన డైట్ పాటించాలి. వీటి కోసం ప్రత్యేక సిస్టమ్‌లను తయారు చేసుకోవాలి.
గమ్యం గురించి ఆలోచించడం మానేసి, మన సిస్టమ్‌ని సరిదిద్దుకుంటే గమ్యం ఆటోమేటిక్‌గా చేరుకుంటాం.
ఏ అలవాటైనా మన మెదడులో నాలుగు దశల ద్వారా ప్రయాణిస్తుంది:
క్యూ : మెదడును ప్రేరేపించే సంకేతం. (ఉదా: ఫోన్ నోటిఫికేషన్ సౌండ్)
లక్ష్యాలు వర్సెస్ సిస్టమ్స్
క్రేవింగ్ : ఆ పని చేయాలనే కోరిక. (ఉదా: మెసేజ్ ఏంటో చూడాలనే ఆత్రుత)
రెస్పాన్స్ : మనం చేసే పని . (ఉదా: ఫోన్ చేతిలోకి తీసుకోవడం)
రివార్డ్ : ఆ పని వల్ల కలిగే తృప్తి. (ఉదా: మెసేజ్ చదివాక కలిగే ఫీలింగ్)
మంచి అలవాట్లు కలగాలంటే ఈ లూప్‌ను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. దీని కోసం జేమ్స్ క్లియర్ ‘నలుగు ప్రవర్తనా నియమాలను’ ఇచ్చారు:
దాన్ని స్పష్టంగా కనిపించేలా చేయండి (మేక్ ఇట్ ఆబ్వియస్).
ఆకర్షణీయంగా మార్చండి (మేక్ ఇట్ అట్రాక్టివ్).
చాలా సులభతరం చేయండి (మేక్ ఇట్ ఈజీ).
తక్షణ తృప్తిని ఇచ్చేలా చూసుకోండి (మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్).
చాలామంది ఫలితం మీద దృష్టి పెడతారు (నేను బరువు తగ్గాలి). కానీ నిజమైన మార్పు మీ ‘గుర్తింపు’ మారినప్పుడు వస్తుంది. మీరు ఒక పనిని “చేస్తున్నాను” అని కాకుండా, “నేను అలాంటి వ్యక్తిని” అని నమ్మాలి.
పుస్తకం చదవడం మీ అలవాటు కాదు, మీరు ఒక ‘రీడర్’ కావాలి.
వ్యాయామం చేయడం మీ పని కాదు, మీరు ఒక ‘అథ్లెట్’ కావాలి.
మీరు చేసే ప్రతి చిన్న పని మీ గుర్తింపునకు వేసే ఒక ఓటు లాంటిది. ఎక్కువ ఓట్లు ఎటు పడితే మీరు అటు మారుతారు.
అలవాటు ఎలా ఏర్పడుతుంది?
క్రమశిక్షణ కంటే పర్యావరణం శక్తివంతమైనది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద జంక్ ఫుడ్ కాకుండా పండ్లను ఉంచండి. మీరు చదవాలనుకుంటే, మీ బెడ్ పక్కన ఫోన్ కాకుండా పుస్తకాన్ని ఉంచండి.
అదే విధంగా మీ ముందు చాక్లెట్లు కనిపిస్తే, మీరు బరువు తగ్గరు! బెడ్ మీదకు ఫోన్ తీసుకెళితే, తొందరగా పడుకోరు కదా, గంటలు గంటలు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోతారు.
మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ అలవాట్లను శాసిస్తుందని గుర్తుపెట్టుకోండి.
1. పాత, చెడు అలవాట్లను వదిలించుకోవడం ఎలా?
చెడు అలవాటును అదృశ్యం చేయండి (ఫోన్ వాడకం తగ్గించాలంటే పక్క గదిలో పెట్టండి), దాన్ని అసహ్యంగా మార్చండి, చేయడం కష్టతరం చేయండి (పాస్‌వర్డ్ కష్టంగా పెట్టండి), చివరగా ఆ పని వల్ల అసంతృప్తి కలిగేలా చూసుకోండి.
2. అలవాటు మారడానికి 21 రోజులు పడుతుందా?
ఇది ఒక అపోహ మాత్రమే. అలవాటు మారడానికి పట్టే సమయం ఆ పని క్లిష్టత మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యం రోజులు కాదు, మీరు ఎన్నిసార్లు ఆ పనిని పునరావృతం చేశారు అనేదే ముఖ్యం.
3. ‘హ్యాబిట్ స్టాకింగ్’ అంటే ఏంటి?
మీకు ఇప్పటికే ఉన్న ఒక అలవాటుకు కొత్త అలవాటును జోడించడం. ఉదాహరణకు: “నేను ఉదయం కాఫీ తాగిన తర్వాత (పాత అలవాటు), ఒక నిమిషం ధ్యానం చేస్తాను (కొత్త అలవాటు).” దీనివల్ల కొత్త పనిని గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది.
4. 2-మినిట్ రూల్ అంటే ఏంటి?
ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించినప్పుడు, అది కేవలం రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఉదాహరణకు, “రోజూ 30 నిమిషాలు యోగా చేయాలి” అని కాకుండా “యోగా మ్యాట్ బయటకు తీయాలి,” అనే చిన్న లక్ష్యంతో మొదలుపెట్టాలి. అప్పుడు మీ బ్రెయిన్ దానిని వ్యతిరేకించదు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
కాబట్టి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ సిస్టమ్‌లపై దృష్టి పెట్టండి. చిన్న మార్పులతో పెద్ద విజయాన్ని సాధించండి. నిరంతర ప్రయత్నంతో ఏదైనా సాధ్యమేనని గుర్తుంచుకోండి.


