
తెలుగు హారర్ కామెడీ చిత్రం బకాసుర రెస్టారెంట్ ఓటీటీలోకి ప్రయాణం చేస్తోంది. ఆగస్టు 8న విడుదలైన ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో సెప్టెంబర్ 12న స్ట్రీమింగ్ అవుతుంది. ఐదుగురు స్నేహితులు రెస్టారెంట్ పెట్టాలని ప్రయత్నిస్తూ దెయ్యాలతో పోరాడే కథ ఇది.
Key Points
బకాసుర రెస్టారెంట్ సినిమా ఆగస్టు 8న విడుదలైంది.
ప్రవీణ్, హర్ష తదితరులు నటించిన ఈ హారర్ కామెడీ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వస్తోంది.
సెప్టెంబర్ 12 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్.
యువత ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుని దెయ్యాల వేటలో పడతారు.
బకాసుర రెస్టారెంట్ ఓటీటీ విడుదల తేదీ
తెలుగులో వచ్చిన మరో హారర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్. ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ప్రముఖ కమెడియన్లు ప్రవీణ్, హర్షలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎంత మేర ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
బకాసుర రెస్టారెంట్ ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు హారర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్ వచ్చే వారం ఓటీటీ లోకి వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (సెప్టెంబర్ 5) వెల్లడించింది.
సినిమా కథాంశం
“ఐదుగురు యువకులు.. ఓ అతీత శక్తి.. సెప్టెంబర్ 12 నుంచి పీడకల మొదలు కాబోతోంది. సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. కామెడీ, గందరగోళం, దెయ్యాలతో కూడిన మీ అన్‌లిమిటెడ్ గందరగోళాల బూఫే అని పోస్టర్ పై రాసి ఉంది.
బకాసుర రెస్టారెంట్ మూవీ గురించి..
బకాసుర రెస్టారెంట్ మూవీ ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో ప్రవీణ్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, గరుడ రామ్, షైనింగ్ ఫణిలాంటి వాళ్లు నటించారు. ఎస్‌జే శివ డైరెక్ట్ చేయగా.. లక్ష్మయ్య ఆచారి, జనార్దన ఆచారి నిర్మించారు. వికాస్ బడిస మ్యూజిక్ అందించాడు. ఈ హారర్ కామెడీ మూవీ పరమేశ్ (ప్రవీణ్) అతని నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
కానీ హైదరాబాద్ లో ఓ మంచి రెస్టారెంట్ పెట్టాలన్నది వాళ్ల కల. అది కుదరకపోవడంతో దెయ్యాల వేట సాగిస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ పెడతారు. ఓ ప్యాలెస్ లో షూటింగ్ సందర్భంగా వాళ్లకు ఓ మంత్రాల పుస్తకం దొరుకుతుంది. దాని ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలనుకొని వాళ్లు చేసిన పని ఓ దెయ్యాన్ని నిద్రలేపుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల పరిస్థితి ఎలా మారింది అన్నది ఈ బకాసుర రెస్టారెంట్ మూవీ స్టోరీ.
ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో నెల రోజుల తర్వాత ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
బకాసుర రెస్టారెంట్ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. దెయ్యాలు, కామెడీల మిశ్రమం ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.


