|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్ సేన్ పై బాలయ్య, తారక్ సీరియస్ వార్నింగ్! ఆ సినిమా ఫలితమే కారణమా?

Published: 06-02-2026, 9:35 AM
విశ్వక్ సేన్ పై బాలయ్య, తారక్ సీరియస్ వార్నింగ్! ఆ సినిమా ఫలితమే కారణమా?
  • విభిన్న చిత్రాలతో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
  • లైలా సినిమా ప్రమోషన్లలో వివాదాలకు కారణమయ్యారు విశ్వక్.
  • లైలా సినిమా చూసి బాలయ్య, తారక్ క్లాస్ పీకారని విశ్వక్ వెల్లడి.
  • ఫంకీ సినిమాతో ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్.

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ గతంలో చేసిన ఒక సినిమా గురించి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ గా క్లాస్ పీకారట. ఆ సినిమా ప్రమోషన్లలో జరిగిన వివాదాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

విశ్వక్ సేన్ కెరీర్ లో వివాదాలు

Vishwak sen: టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen)ఒకరు. ఈయన హీరోగా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో విశ్వక్ సినిమాల కంటే కూడా వివాదాలలో ఎక్కువగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన చేసే వీడియోలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఇక గత ఏడాది ఈయన నటించిన లైలా సినిమా(laila film) విషయంలో ఎలాంటి వివాదం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజకీయాల గురించి ప్రస్తావనకు రావడంతో ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి విశ్వక్ పెద్దగా బయట కూడా ఎక్కడ కనిపించలేదు.

ఇక ప్రస్తుతం ఈయన జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్(Anudeep) దర్శకత్వంలో మరొక క్రేజీ కామెడీ చిత్రం ఫంకీ(Funky) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో విశ్వక్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన బాలకృష్ణ(Balakrishna) జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ బాలయ్యతో చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. విశ్వక్ సినిమాలకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా  కూడా హాజరై మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

బాలయ్య, తారక్ క్లాస్ పీకడానికి కారణం?

ఇలా ఎన్టీఆర్ బాలయ్యతో ఎంతో సన్నిహితంగా ఉండే విశ్వక్ సేన్ కు వీరిద్దరూ బాగా క్లాస్ పీకారని ఈయన తెలియజేశారు. విశ్వక్ నటించిన లైలా సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారు తారక్ అన్న ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయొద్దు అంటూ తనకు బాగానే క్లాస్ పీకారని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక లైలా సినిమాలో విశ్వక్ అమ్మాయి గెటప్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎన్నో వివాదాలు నడుమ గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత విశ్వక్ ఫంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

ఫంకీ సినిమాతో విశ్వక్ రీఎంట్రీ

విశ్వక్ సేన్ గత సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆయన ఇప్పుడు ‘ఫంకీ’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.