
📌 Key Points
- బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం.
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 సినిమా షూటింగ్ ప్రారంభం.
- విజయ్ కనకమేడల దర్శకత్వంలో పవర్ఫుల్ పోలీస్ డ్రామాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.
- సంక్రాంతి బరిలో నిలవడానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 సినిమాను మొదలుపెట్టారు. అంతేకాకుండా విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ పోలీస్ డ్రామాలో నటించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సంక్రాంతికి బాలయ్య ఊచకోత ప్లాన్
Balakrishna Movies: కుర్ర హీరోలే ఒకవైపు ఏడాదికో ఒక్క సినిమా కూడా డెలివర్ చేయలేకపోతుంటే దబిడి దిబిడే అంటూ వరుస సినిమాలతో దంచి కొట్టేందుకు రెడీ అయిపోయాడు నందమూరి బాలకృష్ణ.ఈ మధ్యే ‘అఖండ 2’ అంటూ శివ తాండవం చేసిన బాలయ్య ఇపుడు అదే ఊపులో మరిన్ని సినిమాలని పట్టాలెక్కిస్తున్నాడు.ఈ క్రమంలో ఇప్పటికే NBK111 అంటూ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా మొదలెట్టేసాడు బాలయ్య.ఇక ఈ సినిమా జోరుగా సాగుతుంటే మరో వైపు యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల చెప్పిన ఒక పవర్ఫుల్ పోలీస్ డ్రామాను బాలయ్య ఓకె చేశాడని సమాచారం.
జులై నుంచే మొదలై వచ్చే సంక్రాంతి బరిలో
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం, నాంది’ సినిమాలు ఇతని డైరెక్షన్ లో వచ్చినవే.వాటి లాగే ఈ సినిమా కూడా రా అండ్ రియలిస్టిక్ టచ్ తో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.అసలే బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగులకి,అడిపోయే యాక్షన్ సీక్వెన్స్ లకి పెట్టింది పేరు.మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఉంటుందా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో వినిపిస్తున్న మరో క్రేజీ అప్ డేట్ ఏంటంటే ఈ సినిమాని జులై నుంచే మొదలై వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య.
విజయ్ కనకమేడలతో బాలయ్య నెక్స్ట్ మూవీ
ఇక ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని,దీనికి సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయబోతున్నారని సమాచారం.నిజానికి వచ్చే సంక్రాంతికి NBK111 వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారంతా.ఇపుడు ఈ సినిమాని బరిలోకి దించే ప్లాన్ చేస్తున్నారంటే NBK111 దసరా లేదా దీపావళి బరిలో దిగినా ఆశ్చర్యం లేదు.సో ప్యార్ లల్ గా రెండు సినిమాల్ని సెట్స్ మీద పరిగెత్తించబోతున్నారన్న మాట.దీంతో ఆరు పదులు దాటినా సినిమాల ప్లానింగ్ విషయంలో మా బాలయ్య వేరే లెవల్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.
రెండు భాగాలుగా రానున్న సినిమాకి కురుక్షేత్ర అనే టైటిల్
వివేక్ ఆత్రేయతో కురుక్షేత్రం మూవీ?
ఇక విజయ్ ప్రాజెక్ట్ సంగతి ఇలా ఉంటె వివేక్ ఆత్రేయ కూడా ఒక క్రేజీ కథ వినిపించాడని రెండు భాగాలుగా రానున్న ఆ సినిమాకి కురుక్షేత్ర అనే టైటిల్ పెట్టనున్నారన్న టాక్ వినిపిస్తుంది.ఇంకోవైపు హరీష్ శంకర్, హనీఫ్ ఆదేని, శ్రీనివాస రాజు లాంటి వాళ్ళు బాలయ్య కోసం చక్కర్లు కొడుతున్న వాళ్ళే.మరి ఇంతటి బిజీ షెడ్యూల్ లో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.ఇక వచ్చే సంక్రాంతికి రావాలని ఆశ పడుతున్న బాలయ్యకి పోటీగా చిరంజీవితో పాటు శర్వానంద్, వరుణ్ తేజ్ ల సినిమాలు బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నవే.అంటే వచ్చే పొంగల్ దంగల్ మాములుగా ఉండదన్న మాట.ఇక బాలయ్య విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌లో ‘నరసింహ నాయుడు’, ‘లక్ష్మీ నరసింహ’, ‘వీరసింహారెడ్డి’ వంటి సాలిడ్ హిట్స్ ఎన్నో కొట్టాడు బాలయ్య.మరి విజయ్ కనకమేడల తెరకెక్కించే ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి పాత్ర పోషిస్తాడో,బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో వేచి చూడాల్సిందే.
మొత్తానికి బాలయ్య బాబు ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా విడుదల కానుండటంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


