|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య స్టంట్ ఫెయిల్: రజినీకాంత్ అనుకరణ విఫలం, నవ్వులపాలైన నందమూరి నటసింహం!

Published: 28-01-2026, 1:05 AM
బాలయ్య స్టంట్ ఫెయిల్: రజినీకాంత్ అనుకరణ విఫలం, నవ్వులపాలైన నందమూరి నటసింహం!
  • బాలకృష్ణ రజినీకాంత్ స్టైల్ లో అద్దాలు ఎగరవేయబోయి విఫలమయ్యారు.
  • ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
  • నెటిజన్లు బాలయ్యపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
  • బాలకృష్ణ త్వరలో NBK 111 సినిమాలో నటించనున్నారు.

నందమూరి బాలకృష్ణ రజినీకాంత్ ను అనుకరించబోయి నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బాలయ్య త్వరలో పలు సినిమాల్లో నటించనున్నారు.

బాలయ్య రజినీకాంత్ అనుకరణ

Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు ఏడు పదుల వయసుకు చేరువలో కూడా వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలయ్య.. మరొకవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సాధారణంగా బాలయ్య బయటకి వస్తే మాత్రం అభిమానులపై చేయి కూడా చేసుకుంటూ ఉంటారు.. అంతేకాదు చాలా సార్లు వేదికలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు బాలయ్య. అలాంటి ఈయన తాజాగా సినిమాల్లో లాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) ను అనుకరిస్తూ నవ్వుల పాలయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ లో అద్దాలను గాల్లోకి ఎగరేశారు బాలయ్య. అయితే అది వర్క్ అవుట్ కాక కింద పడిపోవడంతో వెంటనే తీసుకొని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మనకెందుకు ఇలాంటి అనుకరణలు బాలయ్య అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది పాపం బాలయ్య స్టంట్ చేసి నవ్వుల పాలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణ నుండి రాబోయే చిత్రాల విషయానికొస్తే NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ తో హై యాక్షన్ వోల్టేజ్ తో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇకపోతే మార్చి 2026 నుండి ఈ సినిమా షూటింగు ప్రారంభం కానుండగా.. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ సినిమాకి వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

బాలకృష్ణ రాబోయే సినిమాలు

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బాబి కొల్లి తో ఒక ప్రాజెక్టు చేయనున్నారు. మరోవైపు బాలయ్య కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో తెరపైకి రానుంది. మొత్తానికైతే ఈ వయసులో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్రకటిస్తూ తన ఎనర్జిటిక్ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించి.. తనలోని టాలెంట్ ను అందరికీ చూపించారు బాలయ్య. అంతేకాదు హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు గెలుపొంది అటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు

మొత్తానికి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాలయ్య త్వరలో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.