|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bandi Saroj Kumar : నా యాక్టింగ్ కు సెన్సార్ బోర్డు భయపడింది..బండి సరోజ్ స్పీచ్ కు రానా షాక్..

Published: 11-12-2025, 12:48 AM
Bandi Saroj Kumar : నా యాక్టింగ్ కు సెన్సార్ బోర్డు భయపడింది..బండి సరోజ్ స్పీచ్ కు రానా షాక్..
  • బండి సరోజ్ కుమార్ ‘మోగ్లీ’ చిత్రంలో విలన్‌గా నటించారు, ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడారు.
  • తన నటన చూసి సెన్సార్ బోర్డు సభ్యులు భయపడ్డారని బండి సరోజ్ కుమార్ వ్యాఖ్యానించారు.
  • బండి సరోజ్ కుమార్ మాటలు విని హీరో దగ్గుబాటి రానా షాక్ అయ్యారు.
  • ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

‘మోగ్లీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన యాక్టింగ్‌కు సెన్సార్ బోర్డు సభ్యులు భయపడ్డారని ఆయన చెప్పగా, ఈ మాటలకు హీరో రానా షాక్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోగ్లీలో బండి సరోజ్ కుమార్ విలనిజం

Bandi Saroj Kumar : బండి సరోజ్ కుమార్… ఈ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇండిపెండెంట్ సినిమాలతో పాపులర్ అయ్యారు.. ప్రస్తుతం ఈయన సుమ తనయుడు రోషన్ కనకాల నటిస్తున్న మోగ్లీ చిత్రంలో నటించాడు..ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో విలన్ పాత్రలో సరోజ్ కనిపించునున్నాడు. టీజర్, ట్రైలర్స్ లో ఇతనే హైలెట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు చిత్రయూనిట్.. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో బండి సరోజ్ కుమార్ మాట్లాడారు.తన యాక్టింగ్ గురించి సెన్సార్ సభ్యులు కామెంట్స్ చేసిన విషయాన్ని పంచుకున్నారు. అతని మాట విన్న హీరో రానా షాక్ అయ్యారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో ఏమన్నాడో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

బండి సరోజ్ కుమార్ మోగ్లీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో అతని నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులను తన స్పీచ్తో ఆకట్టుకున్నాడు సరోజ్.. తాజాగా మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సరోజ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో అవకాశం రావడానికి కారణమైన సురేష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత సినిమా పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఒక సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం తప్పు కాదు. అది అసభ్యం కాదు.. నా యాక్టింగ్ చూసి సెన్సార్ సభ్యులు భయపడ్డారు.. ఎవడ్రా వీడు.. వీడి యాక్టింగ్ ఏంటి? ఇలా ఉన్నాడేంటి రా బాబు అన్నారట అని సరోజ్ అంటాడు.. ఆ మాట వినగానే  హీరో దగ్గుబాటి రానా షాక్ అయ్యాడు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు నీ కాన్ఫిడెంట్ కు హ్యాట్సాఫ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి మరోసారి బండి సరోజ్ స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది.. మరి సినిమా ఈయనకు ఏ మాత్రం క్రేజ్ ను అందిస్తుందో చూడాలి..

యాక్టింగ్‌పై సెన్సార్ బోర్డు కామెంట్స్‌పై సరోజ్ వెల్లడి

బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది ఆయన తీసిన సినిమా గురించి బయటపెట్టారు. నేను ఒక సినిమాను రెండు కోట్లు పెట్టి తీశాను.. ఆ సినిమా పేరు పరాక్రమం.. సినిమా ప్రమోషన్స్ కు డబ్బుల్లేక చేయలేకపోయాను. సినిమాను రిలీజ్ చేసి ఇంట్లో వచ్చి కూర్చున్నాను.. కానీ నా సినిమాను చూసేందుకు కొందరు తెలిసిన ప్రేక్షకులు ఊర్లు దాటి వచ్చి మరి చూశారు. మూడు వారాలు ఆ సినిమాను ఆడించారు.. వాళ్లందరికీ  పాదాభివందనాలు.. అలాగే ఈ సినిమాని కూడా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని ఆయన అంటారు.. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రానా షాక్.. సోషల్ మీడియాలో వైరల్

యాంకర్ సుమ కనకాల తనయుడు రోహన్ బబ్లు గమ్  సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం మోగ్లీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అఖండ 2 డిసెంబర్ 12  రిలీజ్ కాబోతుంది. దాంతో ఈ మూవీ ఒక్క రోజు వాయిదా పడింది.. రేపు థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన కాన్ఫిడెన్స్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ‘మోగ్లీ’ సినిమాతో ఆయనకు ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.