
📌 Key Points
- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం ఏప్రిల్ 5న జరగనుంది.
- హైదరాబాద్‌లోని బెల్లంకొండ ఫామ్ హౌస్‌లో నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది.
- ఏప్రిల్ 29న తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది.
- మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహం జరగనుంది.
సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం ఎప్పుడు?
Bellam Konda sai Srinivas: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల హీరోలందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఒకరు. అల్లుడు శీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు.
ఇక త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈయన గత కొద్ది నెలలుగా కావ్య రెడ్డి (Kavya Reddy)అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 5వ తేదీ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థం (Engagment) ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. వీరి నిశ్చితార్థపు వేడుక హైదరాబాద్లోనే బెల్లంకొండ ఫామ్ హౌస్ లో జరగబోతుందని సమాచారం. ఇక ఈ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మొత్తం హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.
వివాహం ఎక్కడ, ఎప్పుడు జరగనుంది?
ఇలా ఏప్రిల్ 5వ తేదీ తన ప్రేయసితో నిశ్చితార్థం జరుపుకున్న సాయి శ్రీనివాస్ ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం తిరుపతిలో చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని తెలుస్తోంది. ఇలా ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో వివాహం చేసుకున్న ఈ జంట మే ఒకటవ తేదీ హైదరాబాదులో తిరిగి సినీ, రాజకీయ ప్రముఖులకు ఎంతో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. సాయి శ్రీనివాస్ కావ్యల నిశ్చితార్థానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
కావ్య రెడ్డి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు..
రిసెప్షన్ వివరాలు ఏమిటి?
ఇక వీరిద్దరికి పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే కావ్య రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదని, ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని సమాచారం. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధంలేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి కోడలుగా కావ్య రెడ్డి అడుగు పెట్టబోతున్నారు. శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల భైరవం, కిష్కిందపురి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.


