
📌 Key Points
- APSFTVTDCకి నూతన ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియమితులయ్యారు.
- సీనియర్ నటులు సుమన్ తల్వార్, ఎస్. శివాజీ సహా 14 మంది సినీ ప్రముఖులు డైరెక్టర్లుగా చోటు దక్కించుకున్నారు.
- నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత బుర్రా సాయిమాధవ్, నటి వై. ఝాన్సీ కూడా బోర్డులో ఉన్నారు.
- నూతన కమిటీ అనుభవం, దూరదృష్టితో ఏపీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళల కేంద్రంగా నిలబెట్టాలని ఆకాంక్ష.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పి. భరత్ భూషణ్ ఛైర్మన్‌గా, చిక్కాల మెహర్ రమేష్ కుమార్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు.
నూతన పాలకమండలిలో కీలక నియామకాలు
APSFTVTDC Board: ఇన్ని రోజులుగా కాస్త స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఇపుడు సరికొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తుంది. ఈక్రమంలో APSFTVTDC ని ఎంకరేజ్ చేస్తూ నూతన పాలకమండలిని ప్రకటించింది ap సర్కార్.అందులో భాగంగా ఈ కమిటీకి చైర్మన్‌గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ లనిసెలెక్ట్ చేసింది.
నిర్మాత నందమూరి రామకృష్ణ స్పందిస్తూ
వీరితో పాటు సినీ ఇండస్ట్రీలో ఏళ్ల కొద్ది అనుభవం ఉన్నమరో పద్నాలుగు మంది ప్రముఖులను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇండస్ట్రీకి మంచి బూస్టప్ అనే చెప్పాలి.ఇక సెలెక్ట్ అయిన కొత్త కమిటీకి ప్రముఖ నిర్మాత నందమూరి రామకృష్ణ స్పందిస్తూ నూతన కమిటీకి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్‌లతో పాటు డైరెక్టర్లుగా ఎంపికైన ప్రతి ఒక్కరి అనుభవం, దూరదృష్టి ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సృజనాత్మక కళల కేంద్రంగా నిలబెడతాయని ఆయన ఆకాంక్షించారు.
చోటు దక్కించుకున్న డైరెక్టర్లు వీరే
సినీ ప్రముఖులకు చోటు.. ఇండస్ట్రీ ఆశలు
ఒకసారి ఈ బోర్డులో చోటు దక్కించుకున్న డైరెక్టర్లు ఎవరా అని చూస్తె ..దాదాపు నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియన్ సినిమాను తన నటనతో ఏలిన సీనియర్ నటుడు సుమన్ తల్వార్ ఈ బోర్డులో ఉండటం విశేషం. 1970ల చివరలో కెరీర్ ప్రారంభించి, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన అనుభవం ఈ సంస్థకు ఎంతో ఉపయోగపడుతుంది అనే చెప్పాలి.
అలాగే వైవిధ్యమైన నటుడిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా పేరొందిన ఎస్. శివాజీ సైతం డైరెక్టర్ల జాబితాలో ఉన్నారు. ‘మిస్సమ్మ’, ‘తాజ్ మహల్’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన, పరిశ్రమ సమస్యలపై ఎప్పుడూ గొంతుకగా నిలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో అనుభవమున్న చదలవాడ శ్రీనివాసరావు కూడా ఈ బోర్డులో భాగస్వామ్యం కావడం విశేషం.మరోవైపు, మాటల రచయితగా తెలుగు సినిమాకు సరికొత్త మాటల్ని నేర్పించిన బుర్రా సాయిమాధవ్ తో పాటు సీనియర్ నటి వై. ఝాన్సీ కూడా ఈ డైరెక్టర్ల బోర్డులో చోటు సంపాదించుకున్నారు.
ఏపీకి కళల కేంద్రంగా మార్చే లక్ష్యం
అలాగే టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, నిర్మాత అయిన కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద అలాగే ‘సింహరాశి’, ‘ఎవడైతే నాకేంటి’ వంటి పవర్‌ఫుల్ మాస్ సినిమాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు వి. సముద్ర కూడా ఈ బోర్డులో డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. అలాగే పరిశ్రమలో విభిన్న విభాగాల్లో గుర్తింపు పొందిన కె. ఉమామహేశ్వర రావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ మరియు రాజు ఈ బోర్డులో సభ్యులుగా వ్యవహరించనున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు కృషి
నిర్మాత నందమూరి రామకృష్ణ తన విషెస్ చెబుతూ అందరూ కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా వృద్ధి చెందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. షూటింగ్స్ లొకేషన్ల అభివృద్ధి, సింగిల్ విండో అనుమతులు, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావడం, టీవీ రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచడం వంటి ఎన్నో అంశాలపై ఈ కొత్త కమిటీ దృష్టి పెట్టాల్సి ఉంది. నూతన పాలకమండలి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేవలం షూటింగ్ స్పాట్‌గానే కాకుండా, సరికొత్త కథలకు, సాంకేతిక ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని, యంగ్ టాలెంట్ కి సరైన వేదిక దొరుకుతుందని టాలీవుడ్ భావిస్తుంది.చూడాలి మరి కొత్తగా ఎన్నికైన ఈ కమిటీ ఏ మేరకి తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు కృషి చేస్తుందో !
ఈ నూతన కమిటీ నియామకం ఆంధ్రప్రదేశ్ సినీ, కళా రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. అనుభవజ్ఞులైన సభ్యులతో రాష్ట్రంలో సృజనాత్మక కళల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.


