
📌 Key Points
- మాస్ మహారాజ్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
- ఈ సినిమా థియేటర్ విడుదలైన 59 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
- సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా ఓటీటీ విడుదల ఆలస్యమైందని సమాచారం.
- మార్చి 13 నుంచి ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఓటీటీలోకి విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా దాదాపు 59 రోజుల తర్వాత ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదల ఆలస్యం కావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’!
Bharta Mahashayulaku Vignapthi OTT: గత కొంతకాలంగా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మాస్ మహారాజ్ రవి తేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత దాదాపు 59 రోజుల తర్వాత ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మార్చి 13 నుండి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వచ్చే సినిమాల ట్రెండ్‌కు భిన్నంగా, ఈ సినిమా దాదాపు 59 రోజుల సుదీర్ఘ విండో తర్వాత ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతోంది.
Read also- Psychological horror thriller OTT: వెంటపడుతూ వణికించే దెయ్యం… నరకం చూసే ఫ్యామిలీ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి
విడుదల ఆలస్యానికి కారణం ఏమిటి?
ఈ సినిమా ఓటీటీ విడుదలలో ఇంత ఆలస్యం జరగడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాణ దశలో లేదా పోస్ట్ రిలీజ్ సమయంలో తలెత్తిన కొన్ని ఆర్థిక పరమైన చిక్కుల వల్లే ఈ జాప్యం జరిగినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, ఈ విషయమై అటు మేకర్స్ కానీ, ఇటు ఓటీటీ సంస్థ కానీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కారణం ఏదైనప్పటికీ, ఎట్టకేలకు సినిమా స్ట్రీమింగ్‌కు లైన్ క్లియర్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సగటు మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, భావోద్వేగాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం, థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి థియేటర్లలో మిస్ అయిన వారు మార్చి 13 నుండి తమ ఇంట్లోనే ఈ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
Read also- Thriller movie OTT: మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే
ZEE5లో స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఎట్ట కేలకు మాస్ మహారాజ్ నుంచి వచ్చిన సినిమా ఓటీటీలోకి రావడంతో రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్ మాస్ మహారాజ్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. సంక్రాంతికి విడుదలై కలెక్షన్లు పరంగా ఓకే అనిపించినా.. ఆర్టిక ఇబ్బందులు మాత్రం సినిమాను వెంటాడాయి. ఏది ఏమైనా మాస్ మహారాజ్ సినిమా ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఓటీటీలో ఎంత ప్రభావం చూపుతోందో చూడాలి మరి.
ఏది ఏమైనా రవితేజ సినిమా ఓటీటీలోకి రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇంట్లోనే సినిమా చూసి ఆనందించవచ్చు. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


