|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌ షోపై ఇంట్రెస్ట్ లేదు, రచ్చ చేయకండి, ఫోక్‌ డాన్సర్‌ బోల్డ్ స్టేట్మెంట్‌.. ఈ కంటెస్టెంట్లు కన్ఫమ్‌

Published: 05-09-2025, 5:44 PM
బిగ్‌ బాస్‌ షోపై ఇంట్రెస్ట్ లేదు, రచ్చ చేయకండి, ఫోక్‌ డాన్సర్‌ బోల్డ్ స్టేట్మెంట్‌.. ఈ కంటెస్టెంట్లు కన్ఫమ్‌

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఫోక్ డాన్సర్ నాగదుర్గ షోలో పాల్గొనడం లేదని ప్రకటించడంతో, కంటెస్టెంట్ల జాబితాపై ఆసక్తి పెరిగింది. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

Key Points

1

ఫోక్ డాన్సర్ నాగదుర్గ బిగ్ బాస్ షోలోకి రావడం లేదని ప్రకటించింది.

2

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్ అయ్యింది.

4

కామన్ మ్యాన్ కేటగిరిలో ఐదుగురు కంటెస్టెంట్లు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

నాగదుర్గ బిగ్ బాస్ షోపై స్పందన

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి ప్రారంభానికి ఇంకా ఒక్క రోజే ఉంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతుంది. గత సీజన్ల కంటే ఈ సారి చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన్నట్టు సమాచారం. బిగ్‌ బాస్‌ హౌజ్‌ కూడా సరికొత్తగా ఉండబోతుందట. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా గ్రాండియర్‌గా ఉండనుందని సమాచారం. దీంతోపాటు ఈ సారి రెండు హౌజ్‌లు ఉండబోతున్నాయట. డబుల్‌ గేమ్‌ ఉంటుందని నాగార్జున లేటెస్ట్ ప్రోమోలో తెలిపారు. చూడబోతుంటే ఈ సారి రేటింగ్‌ కోసం చాలా క్రేజీగా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కంటెస్టెంట్లకి సంబంధించిన అప్‌ డేట్‌ ఆసక్తికరంగా మారింది. ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి రాబోతుందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అయ్యింది. తాను బిగ్‌ బాస్‌ షోకి రావడం లేదని తెగేసి చెప్పింది. బిగ్‌ బాస్‌ షోపై ఆసక్తి లేదని, తాను కంటెస్టెంట్‌గా వస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. రూమర్స్ స్ప్రెడ్‌ చేయోద్దని తెలిపింది. అదే సమయంలో ఏదో గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పబోతున్నట్టు వెల్లడించింది. మరి గుడ్‌ న్యూస్‌ ఏంటో చూడాలి.

బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ల లీక్డ్ జాబితా

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల జాబితాలు గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్నాయి. కానీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ పేర్లు మారిపోతున్నాయి. ఎవరు ఫైనల్‌ అనేది క్లారిటీ మిస్‌ అయిన నేపథ్యంలో కన్ఫమ్‌ కంటెస్టెంట్ల లిస్ట్ మాత్రం లీక్‌ అయ్యింది. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య, రీతూ చౌదరీ, దేబ్జానీ, శివ కుమార్‌, నటుడు భరణి, కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌, రాము రాథోడ్‌, టీవీ నటి తనూజా గౌడ, సుమన్‌ శెట్టి, కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ, ఆశా సైనీ, సంజనా గాల్రానీ ఫైనల్‌ అయినట్టు సమాచారం. వీరితోపాటు సింగర్‌ శ్రీతేజ, దీపికా, సుధాకర్‌ కోమాకుల కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఐదుగురు హౌజ్‌లోకి రాబోతున్నారట. వీరిలో మాస్క్ మేన్‌ హరీష్‌, మర్యాద మనీష్‌, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్‌ కళ్యాణ్‌, ప్రియా, డీ మాన్‌ పవన్‌, నాగలు రాబోతున్నారట. వీరిలో ఒక్కరు, ఇద్దరు రాకపోవచ్చు. ఐదుగురు ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఈ రోజు రాత్రికి క్లారిటీ రానుంది. ఆడియెన్స్ నుంచి వచ్చే ఓటింగ్‌ ద్వారా ఇది ఫైనల్‌ కానుంది.

కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు

ఇక రాబోతున్న కంటెస్టెంట్లకి సంబంధించి రీతూ చౌదరీ, ఆషా సైనీ, శ్రష్టి వర్మ, తనూజా పుట్టస్వామీ, భరణి, సంజనా గాల్రానీలు డాన్స్ పర్‌ఫెర్మెన్స్ ఇవ్వబోతున్నారట. వీరు డాన్సులతో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ షూట్‌ కూడా అయిపోయిందని సమాచారం. ఇలా గ్రాండ్‌ లాంచ్‌ రోజు 18 మంది కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపబోతున్నారట. అయితే ఈ సారి రెండు హౌజ్‌లు ఉండటం విశేషం. మరి దాన్ని ఎలా మ్యానేజ్‌ చేస్తారు? ఆ ట్విస్టేంటి? అనేది చూడాలి. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఆదివారం(సెప్టెంబర్‌ 7)న ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్‌ మాలో లైవ్‌ ప్రసారం కానుంది. ప్రతి రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో టెలికాస్ట్ అవుతుంది. గంట పాటు చూపిస్తారు. శనివారం, ఆదివారం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. అలాగే జియో హాట్‌ స్టార్‌లో మాత్రం లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, కంటెస్టెంట్ల జాబితా చర్చనీయాంశంగా మారింది. ఎవరు గెలుస్తారో చూడాలి మరి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.