|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9: రీతూ ప్రవర్తనను నిలదీసిన తల్లి.. చపాతీ కర్ర అందుకుని..

Published: 20-11-2025, 5:53 AM
Bigg Boss 9: రీతూ ప్రవర్తనను నిలదీసిన తల్లి.. చపాతీ కర్ర అందుకుని..

బిగ్ బాస్ 9లో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది. రీతూ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టి, తన కూతురి ప్రవర్తనపై నిలదీసింది. పవన్‌తో లవ్ ట్రాక్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, చపాతీ కర్రతో కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, చివరికి రీతూను ఆప్యాయంగా హత్తుకుంది.

Key Points

1

బిగ్ బాస్ 9లో ఫ్యామిలీ వీక్ ప్రారంభం.

2

రీతూ ప్రవర్తనపై తల్లి ఆగ్రహం.

4

చివరికి కన్నీళ్లతో కూతురిని హత్తుకున్న తల్లి.

ఫ్యామిలీ వీక్ సందడి

పదివారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్‌ ఈ వారం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కారణం.. ఇది ఫ్యామిలీ వీక్‌. అమ్మానాన్న, చెల్లి, భార్య.. ఇలా ఎవరో ఒక రక్తసంబంధీకులు తమకోసం బిగ్‌బాస్‌ ( Bigg Boss Telugu 9 ) హౌస్‌కు రావడం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నారు. ఇప్పటికే సుమన్‌, తనూజ, పవన్‌, దివ్య ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చారు. ఈరోజు రీతూ తల్లి హౌస్‌లోకి రానుంది.

రీతూ తల్లి ఎంట్రీ, క్లాస్

రీతూకి క్లాస్‌ ఈమేరకు ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. అందులో రీతూ తల్లి హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకుంది. ఫాస్ట్‌ ఫార్వర్డ్‌, ఫ్రీజ్‌ అంటూ కంటెస్టెంట్లను ఓ ఆటాడించింది. తల్లిని చూడగానే మిస్‌యూ అంటూ రీతూ ఏడుపందుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం.. నిన్ను కొడ్తా.. నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అని పవన్‌తో లవ్‌ ట్రాక్‌ గురించి పరోక్షంగా నిలదీసింది.

తల్లి ప్రేమ, కన్నీటి ఘట్టం

ఏడుపందుకున్న రీతూ మనం పక్కకెళ్దాం అమ్మ.. అని రీతూ అడిగితే చపాతీ కర్ర అందుకుని కొట్టేందుకు సిద్ధమైంది. కానీ రీతూ ఏడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఎంతైనా తల్లి మనసు కదా.. కూతురి కన్నీళ్లు చూశాక కొట్టే సాహనం చేయలేకపోయింది.

మొత్తానికి ఫ్యామిలీ వీక్‌లో తల్లిదండ్రుల ప్రేమ, వారి ఆవేదన స్పష్టంగా కనిపించాయి. రీతూ విషయంలో ఆమె తల్లి తొలుత ఆగ్రహం వ్యక్తం చేసినా, చివరికి కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఇది తల్లి ప్రేమకు నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.