
బిగ్‌బాస్ సీజన్ 9లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎలిమినేట్ అయిన శ్రీజ, భరణిలకు రీఎంట్రీ అవకాశం లభించినా, శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్‌లో దివ్య విజయం సాధించి, ఇంటి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. పూర్తి వివరాలు కథనంలో.
Key Points
బిగ్‌బాస్ 9లో రీఎంట్రీ అవకాశం పొందిన కంటెస్టెంట్లు శ్రీజ, భరణి.
రీఎంట్రీలోనూ తన అటిట్యూడ్ కారణంగా శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయ్యింది.
భరణి ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లను (తనూజ, దివ్య, సాయి, నిఖిల్) ఎంపిక చేశాడు.
కెప్టెన్సీ టాస్క్‌లో ఒక్క ఓటు తేడాతో దివ్య విజయం సాధించి కొత్త కెప్టెన్ అయింది.
శ్రీజ, భరణిలకు బిగ్‌బాస్‌లో రీఎంట్రీ!
బిగ్‌బాస్ సీజన్ -9 మిగతా సీజన్లకు పూర్తి భిన్నంగా ఉందన్న విషయం తెలిసిందే. ఇందులో కామనర్స్, సెలబ్రిటీలు పాల్గొనగా.. ఇటీవల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ శ్రీజ(sreeja), భరణి(bharani)లకు మరోసారి అవకాశం ఇచ్చాడు. వీరిని ఇంట్లోకి పంపించి.. హౌస్‌లో కంటెస్టెంట్‌గా మరోసారి ఉండేందుకు పలు టాస్కులు కూడా పెట్టాడు. ఇక కొన్ని టాస్కుల్లో భాగంగా భరణి గెలవగా.. శ్రీజ తన అటిట్యూడ్‌తో ఇంటినుంచి మరోసారి ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగురిని సెలెక్ట్ చేయమని భరణికి పవర్ ఇవ్వగా.. తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలెక్ట్ చేశాడు.
దీంతో రీతూ ఫుల్ ఫైర్ అయిపోయింది.ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కి పాట ఆగిపోయేవరకు డ్యాన్స్ చేస్తుండాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ఫ్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచనట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఇక ఈ టాస్కులో తనూజ, దివ్యకు పోటాపోటీగా సపోర్ట్ చేశారు. దీంతో రెండో రౌండ్ ఆడగా.. ఇందులో ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో తనూజ ఏడ్చేసింది.
రీఎంట్రీలోనూ శ్రీజకు తప్పని ఎలిమినేషన్
కెప్టెన్సీ టాస్క్: దివ్య గెలుపు, తనూజ కన్నీళ్లు
బిగ్‌బాస్ 9లో రీఎంట్రీ పొందిన శ్రీజకు అదృష్టం కలిసిరాలేదు. ఆమె ఎలిమినేట్ కాగా, కెప్టెన్సీ టాస్క్‌లో దివ్య గెలుపొందడం విశేషం. ఈ పరిణామాలు బిగ్‌బాస్ హౌస్‌లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.


