|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌ 9 విన్నర్‌ గుట్టురట్టు: భరణి, సుమన్‌ శెట్టి సంచలన ప్రకటన! విజేత ఎవరు?

Published: 15-12-2025, 6:48 AM
బిగ్‌ బాస్‌ 9 విన్నర్‌ గుట్టురట్టు: భరణి, సుమన్‌ శెట్టి సంచలన ప్రకటన! విజేత ఎవరు?
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది.
  • ఎలిమినేషన్‌ తర్వాత భరణి విన్నర్‌ గురించి కీలక ప్రకటన చేశారు.
  • సుమన్‌ శెట్టి కూడా కళ్యాణ్‌కి కప్‌ అనే హింట్‌ ఇచ్చారు.
  • సోషల్‌ మీడియాలో కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలుస్తాడని చర్చ.

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫైనల్‌ ఉత్కంఠగా మారింది. గ్రాండ్‌ ఫినాలేకి ముందే భరణి, సుమన్‌ శెట్టి విన్నర్‌ని కన్ఫమ్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్‌ పడాల విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఈ మాజీ కంటెస్టెంట్లు హింట్‌ ఇచ్చారు. ఇది నాగార్జున, మేకర్స్‌కి కొత్త సవాల్.

బిగ్‌ బాస్‌ 9 టాప్‌ 5 కంటెస్టెంట్స్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఫైనల్‌కి ఇక వారమే ఉంది. వచ్చే ఆదివారం గ్రాండ్‌ ఫినాలే జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భరణి ఎలిమినేషన్‌తో టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయిన విషయం తెలిసిందే. కళ్యాణ్‌, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌, సంజనా గల్రానీ ఫైనల్‌కి చేరుకున్నారు. వీరిలోనే ఒకరు విన్నర్‌గా నిలవబోతున్నారు. అది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మొన్నటి వరకు తనూజ పేరు వినిపించింది. ఆమెకి విన్నర్‌ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని, చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ అని అన్నారు. తనూజ విన్నర్‌ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత గేమ్‌ కళ్యాణ్‌ పడాల వైపు తిరిగింది. ఆయన మొదటి ఫైనలిస్ట్ కావడం, ఇటీవల కాలంలో అత్యధిక ఓటింగ్‌ రావడంతో కళ్యాణ్‌కి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వారం అంతా కళ్యాణ్‌ చుట్టూనే చర్చ జరిగింది.

భరణి విన్నర్‌ని కన్ఫమ్‌ చేశాడా?

ఈ క్రమంలో ఇప్పుడు భరణి, సుమన్‌ శెట్టి కూడా ఇదే ప్రకటించారు. భరణి ఈ ఆదివారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన వెళ్తూ విన్నర్‌ ఎవరో తెలిపారు. బిగ్‌ బాస్‌ బజ్‌లో పాల్గొన్న భరణిని సరదాగా ఆడుతున్నారు శివాజీ. ఇందులో టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లలో ఎవరి స్థానం ఎంత అనేది తెలపాలని హోస్ట్ శివాజీ అడిగారు. దీనికి టాప్‌ 5 సంజనా అని, టాప్‌ 4 డీమాన్‌ పవన్‌ అని, టాప్‌ 3 ఇమ్మాన్యుయెల్‌ అని తెలిపారు. ఇక టాప్‌ 1 మొదట కళ్యాణ్‌కి ఇచ్చాడు భరణి. ఆ తర్వాత తనూజకి కూడా అదే స్థానం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో కళ్యాణ్‌ విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఉందని, లీస్ట్ కేసులో తనూజకి ఛాన్స్ ఉందని భరణి తన అభిప్రాయంగా పంచుకున్నారు.

ఆయనే కాదు సుమన్‌ శెట్టి కూడా అదే విషయం తెలిపారు. ఆయన కూడా అందరు బాగా ఆడాలని, జాగ్రత్త అని తెలిపారు. కానీ కళ్యాణ్‌ విషయంలోనే సుమన్‌ శెట్టి కప్‌ అనే పదాన్ని వాడాడు. కప్‌ కొట్టుకొని రావాలి, వచ్చాక మనం బ్యాంకాక్‌ వెళ్దామనే విషయాన్ని సుమన్‌ శెట్టి చెప్పారు. దీంతో ఈ ఇద్దరు కామన్‌గా కళ్యాణ్‌ పేరుని వెల్లడించారు. వీరే కాదు, సోషల్‌ మీడియాలోనూ అదే చర్చ జరుగుతుంది. కళ్యాణ్‌ పడాలకి విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. భరణి.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ని కన్ఫమ్‌ చేశాడని చెప్పారు. కామన్‌ మ్యాన్‌ దే ఈ సారి కూడా విజయం అంటున్నారు.

సుమన్‌ శెట్టి హింట్‌: కళ్యాణ్‌ విజేతనా?

కళ్యాణ్‌ అభిమానులు మాత్రమే కాదు, కామన్‌ ఆడియెన్స్, నెటిజన్లు కూడా కళ్యాణ్‌ పేరుని బలంగా మెన్షన్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌ విన్నర్‌ కళ్యాణ్‌ అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇదే ఇప్పుడు బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకి పెద్ద తలనొప్పిగా మారింది. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఈ సారి ఇమ్మాన్యుయెల్‌ ని చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు కళ్యాణ్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇది అటు నిర్వాహకులకు, టు నాగార్జునకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఏం చేయాలో ఆలోచనలో పడ్డారట. మరి దీనికి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

భరణి, సుమన్‌ శెట్టిల ప్రకటనలతో బిగ్‌ బాస్‌ 9 విన్నర్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. కళ్యాణ్‌ పడాల విజేతగా నిలుస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే, గ్రాండ్‌ ఫినాలేలో నాగార్జున చేసే అధికారిక ప్రకటన కోసం ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.