|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ హౌజ్‌లో జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ నడుము గిల్లిన హీరోయిన్- కమెడియన్ కంప్లైంట్- నడుమెక్కడ ఉందంటూ తనూజ గౌడ, రీతూ

Published: 16-09-2025, 11:02 AM
బిగ్ బాస్ హౌజ్‌లో జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ నడుము గిల్లిన హీరోయిన్- కమెడియన్ కంప్లైంట్- నడుమెక్కడ ఉందంటూ తనూజ గౌడ, రీతూ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఇమ్మాన్యుయెల్, తనూజ గౌడ మరియు రీతూ చౌదరి మధ్య జరిగిన ఒక హాస్య సంఘటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమ్మాన్యుయెల్ తనూజ పై నడుము గిల్లుతుందని ఫన్నీగా ఫిర్యాదు చేయడం ఈ సంఘటన ముఖ్యాంశం.

Key Points

1

బిగ్ బాస్ హౌస్ లో ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య నడుము గిల్లుకునే హాస్య ప్రయత్నం.

2

తనూజ, రీతూ ఇమ్మాన్యుయెల్ నడుము గురించి చర్చించడం.

4

హాస్యంతో కూడిన ఈ సన్నివేశం బిగ్ బాస్ హౌస్ లో జరిగింది.

ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య హాస్యం

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నామినేట్ అయిపోయింది. ఇక సోమవారం అంటే బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 15 ఎపిసోడ్‌లో రెండో వారం నామినేషన్స్ జరగనున్నాయి. వీటితో పాటు హౌజ్‌లో కంటెస్టెంట్ల మధ్య అల్లరి, కామెడీ, సరదా వేశాలు జరగనున్నాయి.

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో రీతూ చౌదరి, డీమోన్ పవన్ ఇద్దరు బయట కూర్చుని తింటుంటారు. “అగో అక్కడ చూడు. ఆ కపుల్‌ని చూడు” అని ఇమ్మాన్యుయెల్‌కు తనూజ గౌడ చెప్పింది. దాంతో రీతూ చౌదరికి వెళ్లిన ఇమ్మాన్యుయెల్ “రీతూని మిస్ అవుతున్నా అబ్బా నేను. ఈ మధ్య నాతో సరిగా తిరగట్లేదు” అని కామెడీ చేశాడు.

“నా పక్కన ఉన్నట్లు అనిపించట్లేదు” అని తనూజ మాటలు అందించింది. “నా పక్కన ఉన్న దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకురా ఆడుకుంటున్నావ్ మా ఇద్దరి లైఫ్‌లతో.. చెప్పరా.. పాపిష్టోడా” అంటూ ఏడ్చినట్లు చేశాడు ఇమ్మాన్యుయెల్ . ఇంతలో ఇమ్ము పక్క నుంచి తనూజ వెళ్తుంది.

నడుము గిల్లడంపై చర్చ

అప్పుడు “తనూజ ప్లీజ్ నడుము గిల్లకు. పిల్ల ఆటల ఉందా నీకు” అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. దానికి భరణితోపాటు మిగతా వారు నవ్వారు. తనూజ షాక్ అయి చూస్తుండిపోయింది. ” బిగ్ బాస్ ఏంటిది నడుం గిల్లుతుంది” అని ఇమ్ము అంటే.. “హేయ్.. నేను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు” అని తనూజ అంది.

“నడుం గిల్లడం ఏంటీ. ఇదంతా టీవీలో వస్తుంది. బయటకు వెళ్తే ఏమనుకుంటారు చూసేవాళ్లంతా” అని ఇమ్ము అన్నాడు. “ఫస్ట్ థింగ్ నడుము ఎక్కడుందో చూపించు” అని రీతూ చౌదరి అంది. “ఇది నడుము కాదా. ఇంత ఎంతుంది” అని ఇమ్మాన్యుయెల్ అంటే.. అది “నడుమా” అని రీతు అంది. “ఉడుము అనుకున్నావా ఏందీ” అని ఇమ్ము కామెడీ చేశాడు.

రీతూ చౌదరి ప్రతిచర్య

“నడుం ఎక్కడుంది చూపించు చూపించు” అని సీరియల్ హీరోయిన్ తనూజ ఇమ్మాన్యుయెల్ మీదకు వస్తే.. “ప్లీజ్.. కంట్రోల్ యువర్ సెల్ఫ్. తనూజ నా నడుము గిల్లుతుంది బిగ్ బాస్” అని కామెడీగా కంప్లైంట్ చేశాడు ఇమ్మాన్యుయెల్.

“అసలు నడుము ఎక్కడుందో చూపించమనండి బిగ్ బాస్” అని తనూజ అంటే.. “ఇదేంటే” అని ఇమ్మాన్యూయెల్ చూపించాడు. దాంతో “వామ్మో” అని తలలు పక్కకు తిప్పుకున్నారు తనూజ గౌడ, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి.

ఇమ్మాన్యుయెల్ యొక్క హాస్య ప్రయత్నం, తనూజ మరియు రీతూల ప్రతిచర్యలతో బిగ్ బాస్ హౌస్ లో సరదా వాతావరణం నెలకొంది. ఈ సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.