
📌 Key Points
- పశ్చిమ బెంగాల్‌లో ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 154 సీట్లలో ఆధిక్యం.
- మెజార్టీ మార్కును దాటి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- టీఎంసీ 108 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతూ గట్టి పోటీ ఇస్తోంది.
- చాలా నియోజకవర్గాల్లో వందల్లో లీడ్, తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ మెజార్టీ మార్కును దాటేసింది. ఎర్లీ ట్రెండ్స్‌లో 154 సీట్లలో ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, టీఎంసీ కూడా గట్టి పోటీ ఇస్తూ 108 సీట్లలో లీడ్‌లో ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం
పశ్చిమ బెంగాల్ ఎర్లీ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఎంసీకీ, బీజేపీకీ హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికి మొదటి, రెండు రౌండ్లు ఓట్ల లెక్కింపులోను ఇదే ఉత్కంఠ కొనసాగింది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఎర్లీ ట్రెండ్ లో బీజేపీలో 154 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మెజార్టీ మార్కును దాటడంతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార టీఎంసీ కూడా 108 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. చాలా నియోజకవర్గాల్లో వందల్లో మాత్రమే లీడ్ ఉండటంతో.. తుది పలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎర్లీ ట్రెండ్స్ తో టీఎంసీ కార్యాలయం, మమతా బెనర్జీ ఇంటి వద్ద నిశబ్ధ వాతావరణం నెలకొంది.
టీఎంసీకి గట్టి పోటీ, ఉత్కంఠ
సువేందు అధికారి లీడ్, మమతా బెనర్జీ నివాసం వద్ద నిశ్శబ్దం
మెజార్టీ మార్కును దాటినప్పటికీ, టీఎంసీ గట్టి పోటీ ఇవ్వడంతో తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యాలు ఉండటంతో, బెంగాల్‌లో ఎవరు అధికారం చేపడతారనేది చివరి వరకు ఆసక్తికరంగా మారింది.


