|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మనీష్ మల్హోత్రా ఇంట తీవ్ర విషాదం! దిగ్భ్రాంతిలో బాలీవుడ్ ప్రముఖులు!

Published: 20-03-2026, 6:35 AM
షాకింగ్: మనీష్ మల్హోత్రా ఇంట తీవ్ర విషాదం! దిగ్భ్రాంతిలో బాలీవుడ్ ప్రముఖులు!
  • ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తల్లి సావిత్రి మల్హోత్రా కన్నుమూశారు.
  • సావిత్రి మల్హోత్రా వయసు 90 సంవత్సరాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
  • కరణ్ జోహార్, బోనీ కపూర్, షబానా అజ్మీ తదితరులు మనీష్ మల్హోత్రాను పరామర్శించారు.
  • మనీష్ మల్హోత్రా బాలీవుడ్ హీరోయిన్ల కోసం దుస్తులు డిజైన్ చేస్తారు.

బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సావిత్రి మల్హోత్రా వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు.

మనీష్ మల్హోత్రా తల్లి మృతి

Bollywood:సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ముఖ్య వ్యక్తుల మరణం అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులు ఇండస్ట్రీని కూడా దుఃఖంలోకి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండస్ట్రీలో మరోసారి విషాదం ఏర్పడింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా (Manish Malhotra) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మాతృమూర్తి సావిత్రి మల్హోత్రా(Savitri Malhotra) వృద్ధాప్య సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 90 సంవత్సరాలు.. సావిత్రి మల్హోత్ర గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

ఇకపోతే మనీష్ మల్హోత్రా తల్లి సావిత్రి మల్హోత్రా మరణ వార్త తెలిసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మనీష్ మల్హోత్రా నివాసానికి చేరుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటికే కరణ్ జోహార్, బోనీకపూర్, షబానా అజ్మీ , సోఫీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు మనీష్ ను పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా మరి కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు వారి ఇంటికి బయలుదేరుతున్నట్లు సమాచారం.. ఇకపోతే ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన మనీష్ మల్హోత్రాకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె మరణం ఆయనకు తీరని లోటు అంటూ సన్నిహితులు పేర్కొంటున్నారు. సావిత్రి మల్హోత్రా అంత్యక్రియలు ముంబైలోని శాంతాక్రజ్ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నాయి.

సంతాపం తెలుపుతున్న బాలీవుడ్ ప్రముఖులు

ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మనీష్ మల్హోత్రా.. ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేస్తూ ఉంటారు. రంగీలా సినిమాలో ఊర్మిళ మండోట్కర్ కోసం ఆయన దుస్తులు డిజైన్ చేశారు. ఆ తర్వాతే సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత మాధురీ దీక్షిత్, రాణి ముఖర్జీ , ఐశ్వర్యారాయ్ , ప్రియాంక చోప్రా , జుహీ చావ్లా, కరిష్మా కపూర్ , శ్రీదేవి, కాజోల్ , కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ , దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా, ప్రీతి జింటా, పరిణితి చోప్రా ఇలా ఎంతోమంది టాప్ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేస్తూ మనీష్ మల్హోత్రా మంచి పేరు దక్కించుకున్నారు.

మనీష్ మల్హోత్రా సినీ ప్రస్థానం

ఇకపోతే మనీష్ మల్హోత్రా అటు హీరోయిన్లకే కాదు ఇటు హీరోలకు కూడా దుస్తులు డిజైన్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ వంటి టాప్ సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే సినిమాలలో సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేయడమే కాకుండా లాక్మే వంటి ఫ్యాషన్ వీక్ లో సందడి చేయడానికి హీరోయిన్స్ కి దుస్తులు డిజైన్ చేసి తన స్థాయిని అంతర్జాతీయంగా మలుచుకున్నారు మనీష్ మల్హోత్రా.

మనీష్ మల్హోత్రా తల్లి మరణం ఆయనకు తీరని లోటు అని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ ప్రార్థిద్దాం. ఆయన కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.