|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి మాటే శాసనం! ‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా పరిష్కారం!

Published: 27-05-2026, 5:00 PM
చిరంజీవి మాటే శాసనం! ‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా పరిష్కారం!
  • ‘పెద్ది’ సినిమా పర్సంటేజీ వివాదం చిరంజీవి జోక్యంతో పరిష్కారమైంది.
  • థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య సయోధ్య కుదిరింది, కోల్డ్ వార్‌కి ముగింపు పడింది.
  • ‘పెద్ది’ రెంటల్ విధానంలో ప్రదర్శితం, టికెట్ ధరలు పెంచితే ఎగ్జిబిటర్లకు 7.5% అదనం.
  • ఈ నిర్ణయం జూన్ నెలలో విడుదలయ్యే సినిమాలకు మాత్రమే తాత్కాలికంగా వర్తిస్తుంది.

టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ‘పెద్ది’ సినిమా పర్సంటేజీ వివాదానికి మెగాస్టార్ చిరంజీవి ఎండ్ కార్డ్ వేశారు. ఆయన జోక్యంతో థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య సయోధ్య కుదిరింది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం రెంటల్ విధానంలో ప్రదర్శితం కానుంది.

చిరంజీవి జోక్యంతో వివాదానికి తెర

Peddi Dispute: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని వారాలుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘పెద్ది’ సినిమా ప్రదర్శన వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ పద్ధతి వర్సెస్ రెంటల్ విధానంపై నడుస్తున్న కోల్డ్ వార్‌ కి  మెగాస్టార్ చిరంజీవి ఎండ్ కార్డ్ వేసేశాడు.

జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న డైలామాకి ఎండ్ కార్డ్ పడటంతో ఊపిరి పీల్చుకున్నాయి ట్రేడ్ సర్కిల్స్.చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల అద్దె (రెంటల్ సిస్టమ్) విధానమే నడుస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో కలెక్షన్లలో పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనికి నిర్మాతలు అస్సలు ఒప్పుకోకపోవడంతో వివాదం ముదిరింది. ‘పెద్ది’ సినిమా విడుదల దగ్గరకొచ్చేకొద్ది ఈ కాంట్రవర్సీ కలెక్షన్లపై ఎక్కడ దెబ్బకొడుతుందో అని అంతా ఆందోళన పడ్డారంతా.

అదనంగా 7.5 శాతం మొత్తం ఎగ్జిబిటర్లకు

‘పెద్ది’కి రెంటల్ విధానం, ట్విస్ట్ ఏంటి?

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.దీంతో ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, అప్పటివరకు ఇండస్ట్రీ ప్రయోజనాలను దెబ్బతీయవద్దని ఆయన ఎగ్జిబిటర్లకు సూచించారు. దీంతో చిరంజీవి మాటను గౌరవిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒక  నిర్ణయానికి వచ్చారు.

దీని ప్రకారం ‘పెద్ది’ చిత్రాన్ని ఎప్పటిలాగే పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఒకవేళ ఈ సినిమాకు ఎక్కడైనా టికెట్ రేట్లు పెంచితే మాత్రం, సదరు థియేటర్ల రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ రేట్లకే ప్రదర్శిస్తే మాత్రం కేవలం అద్దె మాత్రమే వర్తిస్తుంది.

అందరి దృష్టి  ‘పెద్ది’ సృష్టించబోయే కలెక్షన్లపై

భవిష్యత్ సినిమాలపై ఈ నిర్ణయం ప్రభావం

ఈ నిర్ణయం కేవలం ‘పెద్ది’ సినిమాకే కాకుండా రాబోయే మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ లైనప్‌కు కూడా ఒక రూట్ మ్యాప్ సెట్ చేసిందనే చెప్పాలి.అయితే పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు పూర్తిగా వెనక్కి తగ్గలేదు. కేవలం జూన్ నెలలో వచ్చే సినిమాలకు మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చారు. జూన్ 30 తర్వాత థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గట్టిగా తీర్మానించింది.

అంటే రాబోయే రోజుల్లో టాలీవుడ్ లోని మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాల మేకర్స్ ఈ కొత్త రూల్ కి అనుగుణంగా చర్చలు జరపాల్సి ఉంటుంది.ఏది ఏమైనా వివాదాలన్నీ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ సృష్టించబోయే కలెక్షన్ల సునామీపైనే ఉందని చెప్పకతప్పదు .

చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం ‘పెద్ది’ సినిమా విడుదలకే కాకుండా, భవిష్యత్తులో రాబోయే పెద్ద చిత్రాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఐక్యతను చాటిచెప్పింది, తాత్కాలికంగానైనా వివాదానికి ముగింపు పలికింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.