|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 2 ఎపిసోడ్: గర్భవతి అయిన కావ్య- రాజ్ పరిస్థితికి కుమిలిపోయిన కళావతి- కూతురు రేవతిని క్షమించమన్న అపర్ణ

Published: 01-08-2025, 9:46 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 2 ఎపిసోడ్: గర్భవతి అయిన కావ్య- రాజ్ పరిస్థితికి కుమిలిపోయిన కళావతి- కూతురు రేవతిని క్షమించమన్న అపర్ణ

బ్రహ్మముడి సీరియల్‌లోని ఆగస్ట్ 2 ఎపిసోడ్‌లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. కావ్య గర్భవతి అవడంతో కుటుంబంలో కలవరం, రుద్రాణి అనుమానాలు, అపర్ణ రేవతిని క్షమించడం వంటివి ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.

Key Points

1

ఇందిరాదేవి మాటలతో రుద్రాణి అనుమానపడుతుంది.

2

కావ్య గర్భవతి అని తెలిసి కళావతి కుమిలిపోతుంది.

4

రాజ్ మరియు కావ్య భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి.

రుద్రాణి అనుమానాలు

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందిరాదేవి మాట జారడంతో రుద్రాణి అనుమానిస్తుంది. నిజంగానే వాడికి ఇంటితో సంబంధం ఉందా అని డౌట్ పడుతుంది రుద్రాణి . స్వరాజ్‌కు ప్రేమగా అపర్ణ దోశలు తినిపిస్తుంది. అది చూసి చాలా సంతోషంగా ఉందని ఇందిరాదేవి అంటే.. నాకు మాత్రం జాలిగా ఉందని రుద్రాణి అంటుంది.

ఇంట్లో కోడలు ఉండగా మనవళ్లు లేరు, బయటి వాళ్లను ప్రేమగా చూడాల్సి వస్తుంది. ఇక రేవతి ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు. రాజ్, కావ్య చెరో దిక్కు ఉన్నారు. వదినకు మనవళ్లను ఎత్తుకునే యోగం ఉందో లేదో అని రుద్రాణి అంటుంది. దాంతో ప్రకాశం కౌంటర్స్ వేస్తాడు. రాజ్, కావ్య త్వరలోనే ఒక్కటవుతారని, అంతరకు కుళ్లుపోతుతోనే కడుపు నింపుకోమని అంటాడు.

కావ్య బాధగా చూస్తుంది. ఇంతలో అప్పు వచ్చి స్వరాజ్ తల్లిదండ్రులు దొరికారట అని చెబుతుంది. వాళ్లు ఎవరో తెలుసుకోవచ్చు అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతకీ వాళ్ల పేరు ఏంటీ, ఎవరు వాళ్లు. ఇప్పుడు ఎవరో వచ్చి పేరెంట్స్ అంటే ఇచ్చేస్తామా. ఆ తర్వాత వాళ్లు అసలైన పేరెంట్స్ కాకపోతే సమస్య వస్తే ఎలా. వాళ్ల పేర్లు ఏంటీ అని రుద్రాణి అంటుంది.

కావ్య గర్భం

ముందు అప్పు తడబడుతుంది. దాంతో రుద్రాణి మరింత అనుమానంగా అడుగుతుంది. వాళ్ల పేర్లు లక్ష్మీ, రాకేష్ అని అప్పు చెబుతుంది. ఈ ఆన్సర్ సాటిస్‌ఫ్యాక్షన్‌గా లేదు. వాళ్లనే ఇంటికి రమ్మని చెప్పండి. ఇక్కడి నుంచే తీసుకుని బాబును తీసుకెళ్లమనండి అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య, అప్పు, ఇందిరాదేవి టెన్షన్ పడతారు. రుద్రాణి చెప్పింది నిజమే వాళ్లని ఇక్కడికే రప్పించండి నేను మాట్లడతాను అని అపర్ణ అంటుంది.

మంచి చేయబోయేతే ఇదివరకే అప్పు సమస్య తెచ్చుకుందని కావ్య అంటుంది. వీళ్ల తల్లిదండ్రులు మన ఇంట్లో చూసి మనమే వీడిని కిడ్నాప్ చేశామనుకుంటే. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం అప్పజెప్పాలి అని అప్పు అంటుంది. నీతో వీడిని పంపలేను. కావాలంటే వాళ్లతో ఫోన్‌లో మాట్లాడించు. లేదా నేను పోలీస్ స్టేషన్‌కు వస్తాను అని అపర్ణ అంటుంది.

దాంతో కంగారుపడిన కావ్య అప్పు వాళ్లతో కాల్ మాట్లాడించు అని చెబుతుంది. దాంతో రేవతికి అప్పు కాల్ చేసి విషయం చెబుతుంది. రేవతితో అపర్ణ మాట్లాడుతుంది. పిల్లాడిని అలా గుడిలో వదిలేస్తారా. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అపర్ణ వారిస్తుంది. కొబ్బరికాయలు తీసుకొద్దామని వెళ్తే అక్కడ స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు బాబు తప్పిపోయాడని రేవతి చెబుతుంది.

రేవతి క్షమాపణ

అయ్యో క్షమించండి. నాదే పొరపాటు. బాబును వదిలేసారని మీ పరిస్థితి తెలుసుకోకుండా అన్నాను. మీ బాబును నా సొంత మనవడిలా చూసుకుంటున్నాను అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందని, బాబును రెడీ చేయిస్తానని తీసుకెళ్తుంది అపర్ణ . అరేయ్, వీడికి ఇంటికి లింక్ ఉందిరా. వాడి పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి. అప్పు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే ఫాలో అవ్వు. అప్పుడు చెబుతా పొట్టిదాని పని అని రాహుల్‌కు చెబుతుంది రుద్రాణి.

మరోవైపు ఇప్పటివరకు పడిన కష్టాలు చాలు. ఇకనైనా మమ్మల్ని కలుపు అని కృష్ణుడికి మొక్కుకుంటుంది కావ్య. ఇంతలో కావ్య వాంతులు చేసుకుంటుంది. డౌట్ వచ్చిన కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. దాంతో సంతోషంగా అపర్ణకు చెప్పబోతు ఆగిపోతుంది. ప్రస్తుతం రాజ్ ఉన్న పరిస్థితి తలుచుకుని బాధపడుతుంది. ఇంతలో అప్పు వస్తుంది.

అప్పును బాధగా హగ్ చేసుకుంటుంది కావ్య. అప్పుడు అప్పుకు తాను గర్భవతి అయినట్లు కావ్య చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కావ్య గర్భవతి అవడం, రేవతి తప్పుకు అపర్ణ క్షమాపణ, ఇందిరాదేవి మాటల వల్ల రుద్రాణి అనుమానాలు పెరగడం ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. కథ ఎలా ముందుకు సాగుతుందో తెలుసుకోవడానికి మరిన్ని ఎపిసోడ్స్ చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.