
బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో యామిని రాజ్‌కు పెళ్లి కార్డు ఇస్తుంది. కానీ, రాజ్ ప్రవర్తన వింతగా ఉంటుంది. కావ్య మరియు కల్యాణ్ రాజ్ గతం గుర్తు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు.
Key Points
రాజ్‌కు యామినితో పెళ్లి విషయం నచ్చలేదు.
కావ్య మరియు కల్యాణ్ రాజ్ గతం గుర్తు చేయడానికి ప్రణాళిక వేశారు.
యామినిని రెండు రోజులు దూరంగా ఉంచాలని కావ్య భావిస్తుంది.
సందీప్ అనే స్నేహితుడు యామిని పెళ్ళిని ఆపే ప్రయత్నం చేస్తాడా?
రాజ్ యామిని పెళ్ళికి నిరాకరణ
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ దగ్గరికి వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొస్తుంది యామిని. చూడు బావ అని ఇస్తుంది. యామిని వెడ్స్ రామ్ అని ఉంటుంది. కానీ, రాజ్‌కు అంతగా నచ్చదు. లోపల ఇంకా అందంగా ఉంటుంది చూడు అని యామిని అనేసరికి వెడ్డింగ్ కార్డ్ లోపల చూస్తాడు రాజ్. మన ఫ్యూచర్ కూడా ఈ పెళ్లి పత్రిక లాగే ఎంతో అందంగా ఉంటుంది. ఏమంటావ్ బావ అని యామిని అంటుంది.
కానీ, రాజ్ సైలెంట్‌గా ఉండటంతో ఏమైంది బావ అని యామిని అడుగుతుంది. ఏం లేదు. కొంచెం హెడెక్‌గా ఉందని రాజ్ అంటాడు. నార్మల్ హెడెక్ అయితే ట్యాబిలెట్స్‌తో పోతుంది. కానీ నేనే హెడెక్ అయితేనే ప్రాబ్లమ్ బావ అని యామిని అంటుంది. అలా ఎందుకు మాట్లాడతావ్ అని రాజ్ అంటాడు. కొన్ని రోజులుగా నీ ప్రవర్తన వింతగా ఉంది, చాలా బిజీగా ఉంటున్నావ్ అని యామిని అంటుంది.
ఇలానే రేపు పెళ్లి పీటల మీద కూర్చోడానికి కూడా నీకు టైమ్ లేదంటావో అని భయంగా ఉంది. కానీ, ఒక్కటి నిజం. నువ్వే నా జీవితం. నువ్ లేకుంటే నాకు ఈ జీవితమే అక్కర్లేదు అని యామిని వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ గురించి తెలిసిన గొడవ చేయకుండా అందరికి అర్థమయ్యేలా చేశావ్ అని కావ్యను అంటుంది అపర్ణ. సరేగానీ ఆ యామిని ఊరుకుంటుందా అని అపర్ణ అంటుంది.
అన్నయ్య గతం గుర్తుకు వచ్చేవిధంగా ఏదైనా చేయాలి అని కల్యాణ్ అంటాడు. అలా నాకూడా ఉందని, ఏం చేసిన ఆయన ప్రాణానికి ప్రమాదం రాకూడదని ఆలోచిస్తున్నాను అని కావ్య అంటుంది. గతంలో మీ మధ్యలో జరిగిన సంఘటనలను తిరిగి రాజ్ ముందు కనపడేలా చేస్తే గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉందని అపర్ణ అంటుంది. ఈ ఐడియా బాగుందని స్వప్న అంటుంది.
మీరు ఎంత చెప్పిన ధైర్యం రావట్లేదు అని కావ్య అంటే.. మరి నువ్వన్నట్లు వెయిట్ చేద్దాం. రేపు పెళ్లి పీటల మీద రాజ్ కూర్చుంటే ఆపగలవా. అప్పుడు నిజం చెప్పగలవా అని స్వప్న అంటుంది. నాకు కూడా ఇది మంచి ఐడియా అనిపిస్తుందని అప్పు అనడంతో కావ్య ఒప్పుకుంటుంది. యామిని ఫ్యామిలీ నుండి దూరంగా తీసుకెళ్లి మనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడే గతం గుర్తు చేయగలం అని కావ్య అంటుంది.
అంత టైమ్ యామిని ఎక్కడ ఇస్తుందని అపర్ణ అంటుంది. ఇస్తుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సందీప్ ఉన్నాడుగా. పెళ్లి రోజు వెళ్లి డబ్బు కోసం ఆమె పెళ్లి చేసుకుంటుందని ఆపేయాలని చూశాడు అతనేనా అని కల్యాణ్ అంటాడు. రేపు వాళ్లది యానివర్సరీ అట రిసార్ట్‌లో పార్టీ ఇస్తున్నారు. రెండు రోజులు అక్కడే ఉండొచ్చు. దానికి గనుక మీ అన్నయ్యను తీసుకురాగలిగితే కావాల్సినంత టైమ్ దొరుకుతుంది అని కావ్య అంటుంది.
ఈ ప్లాన్ బాగుంది. బావ మనతోనే ఉంటాడు కాబట్టి గతం గుర్తుకు తెప్పించొచ్చు అని అప్పు అంటుంది. కానీ, యామిని రాకుండా చూడాలి అని కల్యాణ్ అంటాడు. ఏం చేసైనా రాజ్ వచ్చేలా ఒప్పించు అని కావ్యతో అపర్ణ అంటుంది. మరోవైపు పెళ్లి కార్డ్ చూస్తూ ఆలోచిస్తుంటాడు రాజ్. నాకెందుకో తనతో పెళ్లి అంటేనే నా మనసు అంగీకరించట్లేదు. కళావతి గారితో ఉన్నంత ఎగ్జైట్‌మెంట్ యామినితో లేదని అని రాజ్ అంటాడు.
కావ్య మరియు కల్యాణ్ యొక్క ప్రణాళిక
నాకే ఇలాగే అనిపిస్తుందా. కళావతికి కూడా అనిపిస్తుందా. ఒకవేళ కళావతికి కూడా ఇలాగే అనిపిస్తే.. వీళ్లకు వీలైనంత త్వరగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని రాజ్ అనుకుంటాడు. బావను రిసార్టుకు రమ్మను. కవి అక్కడ అందరితో మాట్లాడేశాడు అని అప్పు అంటుంది. వెంటనే తనతో మాట్లాడాలి అని రాజ్ కావ్యకు కాల్ చేస్తాడు.
కళావతి గారు బిజీగా ఉన్నారా అని రాజ్ అంటాడు. అవునండి. బిజీగా ఉన్నాను. నా ఫ్రెండ్ సందీప్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఫ్రెండ్స్ అంతా గెట్ టు గెదర్ చేస్తున్నాం. రేపు అక్కడికి వెళ్తున్నాం. ఒక్కొక్కరు ఎక్కడో ఉన్నారు. వాళ్లందరిని పిలవాలి అని కావ్య అంటుంది. హో ఫ్రెండ్స్ అంతా మీట్ అవుతున్నారన్నమాట. మరి ముఖ్యమైన ఫ్రెండ్‌ను మర్చిపోయారేంటండి అని రాజ్ అంటాడు.
ఎవరండి అని కావ్య అంటే.. నేనే అండి. నేను కూడా ఫ్రెండే కదా. మీరు నన్ను పిలవరా మరి రాజ్ అంటాడు. కావాలనే కావ్య బెట్టు చేస్తుంది. ఎన్నో పనులు ఉంటాయి. ఎక్కడో ఉన్న రిసార్టుకు వచ్చి చాలా సేపు టైమ్ స్పెండ్ చేయడం కష్టమండి అని కావ్య అంటుంది. నా పనులన్నీ మానుకుని మీతో టైమ్ స్పెండ్ చేస్తాను. మీకంటే నాకు ముఖ్యమైన పనులు ఏవి లేవు. ఇది ఫిక్స్. మనం కలిసి వెళ్తున్నాం. నో మోర్ డిస్కషన్ అని రాజ్ అంటాడు.
మనం రమ్మని పిలవమంటే బావే వచ్చేలా చేసింది అని కావ్యను అప్పు అంటుంది. లేకుంటే మనం నేరుగా పిలిస్తే ఆయనకు అనుమానం వస్తుంది. అందుకే రివర్స్‌లో వెళ్లా అని కావ్య అంటుంది. ఇక రేపు రిసార్టులో మొదలు పెడదాం మన అసలైన నాటకం. ఫ్రెండ్స్ సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య సంగతి మీరు చూసుకోండి అని కల్యాణ్ అంటాడు. రేపు వెళ్లి తనతో మనసు విప్పి మాట్లాడి మనసులో ఏముందో తెలుసుకుని నా ఈ కన్‌ఫ్యూజన్‌కి పులిస్టాఫ్ పెడతానని రాజ్ అనుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం వెడ్డింగ్ కార్డ్స్ ఎవరు ఎవరికి ఇవ్వాలో లిస్ట్ రెడీ చేశానని యామిని అంటుంది. ముందు అల్లుడు గారికి చెప్పి బయలుదేరండి అని వైధేహి అంటుంది. ఇంతలో రామ్ లగేజ్‌తో కనిపించేసరికి అంతా షాక్ అవుతారు. నేను బయటకు వెళ్తున్నాను అని రాజ్ అంటాడు. వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్దామనుకున్నాను అని యామిని అంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే వెడ్డింగ్ కార్డ్స్ పంచడం లేట్ అవుతుందని వైధేహి అంటుంది.
చెప్పారు. కానీ, నేను మర్చిపోయాను. సారీ యామినీ. నా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. దానికి వెళ్తున్నాను అని రాజ్ అంటాడు. నాకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ ఎవరు. నాకు కూడా ఇన్విటేషన్ రావాలి. నీ ఫ్రెండ్స్ ఎవరో నీకు గుర్తు లేదుగా అని యామిని అంటుంది. నన్ను అని నువ్ మర్చిపోయావా. నువ్ కామన్ ఫ్రెండ్స్ అని పరిచయం చేశావుగా. వాటర్ ఫాల్స్ అని వాళ్లను భయపెట్టేవాన్నేగా. వాళ్ల ఫ్రెండ్స్‌లోనే సందీప్ అని వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అని రాజ్ అంటాడు.
యామినిని దూరంగా ఉంచే ప్రయత్నం
ఫ్రెండ్స్ అంతా గెట్ టు గెదర్ అవుతున్నారు. నైట్ కూడా అక్కడే ఉంటాను. అందుకే బ్యాగ్ తీసుకెళ్తున్నాను అని రాజ్ అంటాడు. మన పెళ్లికంటే ఇదే ముఖ్యమా అని యామిని అంటే.. అక్కడికి వెళ్లడమే నాకు ముఖ్యం అని రాజ్ మనసులో అనుకుంటాడు. నేను మాటిచ్చాను. నా ఒక్కడి వల్ల వాళ్లంత డిస్టర్బ్ అవడం నాకిష్టం లేదని రాజ్ అంటాడు.యామిని నన్ను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది అని యామిని నుంచి తెలివిగా తప్పించుకుంటాడు రాజ్.
నేను కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు. నేను వెయిట్ చేస్తాను. వెళ్లిరా అని యామిని అంటే.. థ్యాంక్స్ అని వెళ్లిపోతాడు రాజ్. నీకు తెలియని ఫ్రెండ్స్ ఎవరని తండ్రి అడిగితే.. రాజ్ గతం మర్చిపోయినా తెలివితేటలు బాగానే ఉన్నాయి. మా కామన్ ఫ్రెండ్స్ అంటూ కట్టు కథ అల్లితే అదే కథను నాకు తిరిగి చెప్పి నన్ను ఫూల్‌ను చేశాడు అని యామిని అంటుంది. అలా చెప్పాల్సిన అవసరం ఏంటని వైధేహి అంటుంది.
కావ్య.. తన మొగుడుని ఎలాగైనా లాక్కోవడం కావ్య అవసరం. ఇప్పుడు ఈ ప్లాన్ కూడా అదే వేసింది. బావ అదే ఫాలో అవుతుంది. అది బావకు తెలియదు. కావ్య ఇంత త్వరగా గేమ్ మొదలుపెడుతుందని అనుకోలేదు. చెబుతా దాని సంగతి అని యామిని అంటుంది. వెళ్లి కావ్యకు కాల్ చేస్తుంది యామిని. హలో యామిని గారు ఆయన బయలుదేరారా. నేను కూడా బయలుదేరుతాను అని కావ్య అంటుంది.
ఎందుకిలా చేస్తున్నావ్. నేను ప్రేమించినవాడిని నువ్ పెళ్లి చేసుకున్నావ్ అని యామిని అంటే.. నిన్ను చీకోట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు అని కావ్య అంటుంది. నీ గతం చెరిపేస్తాను అని యామిని అంటే.. ప్రతిసారి నీ ఆటలు సాగుతాయని అనుకోకు. పైనున్న దేవుడు అందరిని ఆడిస్తాడు. మా ఇద్దరిని బ్రహ్మముడితో ఎప్పుడో కలిపాడు. మాది జన్మజన్మల బంధం. అది ఎప్పటికీ తెగిపోదు అని కావ్య అంటుంది.
మనిషి తలుచుకుంటే తలరాతను కూడా మార్చగలడు అని యామిని అంటుంది. ఆపు అని గట్టిగా అరుస్తుంది కావ్య. గతం మర్చిపోయి నీ దగ్గర సైలెంట్‌గా ఉంటే మా ఆయన్ను చేతకాని వాడు అనుకుంటున్నావా. ఒక్కసారి గతం గుర్తుకు వస్తే నిన్ను జీవితంలో అడుగు కూడా పెట్టనివ్వడు. ఆరోజు ఇంకా ఎంతో దూరంలో లేదు అని కావ్య అంటుంది. ఇప్పుడు రిసార్టుకు తీసుకెళ్లి రోజంతా ఉండి గతం గుర్తు చేద్దామనుకుంటున్నావా. అలా చేయనివ్వను అని యామిని అంటుంది.
ఆల్ ది బెస్ట్ అని కావ్య చెబుతుంది.తర్వాత ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటున్నామని రుద్రాణి , రాహుల్‌కు చెప్పి వెళ్లిపోతుంది కావ్య. దాంతో కావ్య ఎక్కడికి వెళ్తుందో డీటేల్స్ కనుక్కో అని రాహుల్‌కు చెబుతుంది రుద్రాణి. కావ్యపై రాహుల్ నిఘా పెడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కావ్య మరియు కల్యాణ్ యొక్క ప్రణాళిక విజయవంతం అవుతుందా? రాజ్ గతం గుర్తుంచుకుంటాడా? యామిని భవిష్యత్తు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాలి.


