
బ్రహ్మముడి సీరియల్ 822వ ఎపిసోడ్ లో, రుద్రాణి యొక్క దుష్ట పన్నాగాలతో ఉత్కంఠ పెరిగింది. స్వరాజ్ కావ్యను కాపాడటం, రేవతిపై నింద మోపే ప్రయత్నం కథను ఆసక్తికరంగా మార్చాయి.
Key Points
రుద్రాణి కావ్యను హాని చేయడానికి ప్రయత్నించింది, కానీ స్వరాజ్ ఆమెను కాపాడాడు.
రుద్రాణి రేవతిపై నెక్లెస్ దొంగతనం నింద మోపడానికి ప్రయత్నించింది.
రేవతి మరియు రాజ్ మధ్య ఆత్మీయత పెరిగింది.
కావ్యను కాపాడిన స్వరాజ్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 822వ ఎపిసోడ్ ఉత్కంఠ రేపేలా సాగింది. దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ సందర్భంగా తీర్థంలో కడుపు పోగొట్టే ట్యాబ్లెట్లను రుద్రాణి కలపడం, అది కావ్య తీసుకోబోతుండగా అనుకోకుండా స్వరాజ్ కాపాడటం, ఆ తర్వాత రేవతిని ఎలాగైనా ఇరికించేందుకు రుద్రాణి ప్లాన్స్ చేయడంలాంటివి చూడొచ్చు.
రుద్రాణితో ఆడుకున్న స్వరాజ్, కనకం
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ రుద్రాణితో స్వరాజ్, కనకం ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. తీర్థంలో పౌడర్ కలిపి వెనక్కి తిరిగే సరికి ఆ ఇద్దరూ రుద్రాణినే చూస్తుంటారు. దీంతో వీళ్లు చూసేశారా ఏంటి అంటూ కంగారు పడుతుంది. డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలుచుకునే స్వరాజ్, కనకం మాత్రం ఏం చేస్తున్నావ్ అని నిలదీస్తారు.
మా ఫ్రెండు నేను ఈ ఇంటి వారసుడిని.. నేను ఏం అడిగినా ఇవ్వమని చెప్పింది కదా.. మరి నువ్వు జ్యూస్ ఎందుకు ఇవ్వలేదని స్వరాజ్ అడుగుతాడు. నేను ఇవ్వను అని రుద్రాణి అంటుంది. సరే అయితే మా ఫ్రెండుకు చెబుతాననడంతో భయపడి తెస్తానుండు అంటూ వెళ్లిపోతుంది.
దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ
ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ సందడి మొదలవుతుంది. రాజ్, కల్యాణ్, రాహుల్ ఇంట్లోకి గణపతి విగ్రహం తీసుకొస్తారు. పంతులుగారు పూజ మొదలుపెడతారు. ఇంట్లో అందరూ నిష్టగా గణపతి పూజలో పాల్గొంటారు. రుద్రాణి, రాహుల్ మాత్రం ఆ తీర్థం వైపే చూస్తుంటారు. దూరంగా ఉన్న రేవతిని దగ్గరికి రా అక్కా అని రాజ్ పిలుస్తాడు. దీంతో అపర్ణ కూడా ఆమెను పిలిచి తన పక్కనే నిల్చోమంటుంది.
రేవతిపై నింద మోపిన రుద్రాణి
ఏడుస్తూ వెళ్లిపోయిన రేవతి.. ఫాలో అయిన రుద్రాణి
ఆ తర్వాత పంతులుగారు హారతి ఇచ్చి అందరినీ మొక్కమని అంటాడు. ఆ క్రమంలో రేవతి దగ్గరికి వస్తాడు. హారతి తీసుకునే సమయంలో కూడా ముసుగు తీయవా అని రుద్రాణి అంటుంది. దీంతో పక్కనే ప్రకాశం ఆమె దగ్గరికి వెళ్లి రుద్రాణిని తీసుకొస్తాడు. నువ్వే ముసుగు తియ్యు అని అంటాడు. ఆమె తీయబోతుండగా.. శవయాత్రకు సిద్ధం చేయండి అని ప్రకాశ్ అనడంతో ఆమె భయపడి వెనక్కి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత రేవతి ఏడుస్తూ బయటకు వెళ్లడంతో అందరూ కంగారుపడతారు. తాను వెళ్లి చూస్తానని రాజ్ కూడా వెంటే వెళ్తాడు. వీళ్లు ఏం చేస్తున్నారో చూడటానికి రుద్రాణి ఫాలో అవుతుంది. తాను మళ్లీ ఇలా ఇంట్లో వాళ్లందరితో కలిసి పండగ చేసుకుంటునని అనుకోలేదు.. నీవల్లే సాధ్యమైంది.. థ్యాంక్స్ రాజ్ అని రేవతి అంటుంది. ఇది ఏడ్చే సమయం కాదు.. ఎంజాయ్ చేయాల్సిన టైమ్ అని రాజ్ అంటాడు. దూరం నుంచి రుద్రాణి, రాహుల్ చూస్తుంటారు. ఆ ముసుగులో ఉన్న మనిషిని చూస్తుంటే ఏదో తేడా కొడుతోందని రుద్రాణి అంటుంది.
ఈలోపు లోపల పంతులుగారు తీర్థం ఇస్తుండటంతో తమ ప్లాన్ ఏమవుతుందో చూద్దాం పద అంటూ రాహుల్ ఆమెను లోనికి తీసుకెళ్తాడు. అక్కడ పంతులుగారు అందరికీ తీర్థం ఇస్తూ ఉంటాడు. మనం చేసేది మంచి పని కాదు.. మరి ఆ దేవుడు మనకు సహకరిస్తాడా అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. ఈసారి వర్కౌట్ కాకపోతే మళ్లీ గట్టిగా ప్రయత్నించమని అర్థం..
ఒకవేళ అయిందంటే పిల్లలను కనే యోగ్యం లేదని వాళ్లు బాధపడుతూ కూర్చొంటారు అని రుద్రాణి అంటుంది. అయితే కావ్య దగ్గరికి వెళ్లిన పంతులుగారు ఆమెకు తీర్థం ఇస్తాడు. ఇంతలో స్వరాజ్ ఆయ్.. తీర్థం అంటూ వేగంగా వచ్చి రాజ్, కావ్య, పంతులుగారిని ఢీకొడతాడు. దీంతో కావ్య చేతుల్లో ఉన్న తీర్థంతోపాటు మొత్తం తీర్థం చెంబు కూడా కింద పడిపోతుంది. అలా స్వరాజ్ అనుకోకుండా కావ్య, అప్పులను కాపాడతాడు.
దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ
రుద్రాణికి క్లాస్ పీకిన ఇంట్లో వాళ్లు
అది చూసిన రుద్రాణి.. స్వరాజ్ ను తిడుతుంది. వెంటనే రేవతి అతన్ని దగ్గరికి తీసుకొని మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిడతారు. స్వరాజ్ కూడా ఈ రుబ్బు రోలు సంగతి చూడు ఫ్రెండు అని అనడంతో ఎవరు రా రుబ్బు రోలు అని రుద్రాణి కోప్పడుతుంది. చివరికి ఆ చిన్న పిల్లాడితో కూడా తిట్లు తింటావా రుద్రాణి అని కనకం అంటే.. మా రుద్రాణికి తిట్లు తినకపోతే ముద్ద దిగదు అని ఇందిరాదేవి అంటుంది. అందరికీ భోజనాలు వడ్డిస్తానంటూ కావ్య కిచెన్ లోకి వెళ్తుంది.
కావ్య, రాజ్ కిచెన్ రొమాన్స్
అటు కిచెన్ లో వంట చేస్తున్నకావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ వెనుక నుంచి ముద్దిస్తాడు. దీంతో ఆమె ఉలిక్కిపడి చేతిలో ఉన్న గరిటెను వెనక్కి తిప్పడంతో అతని మూతి కాలుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కిచెన్ లోనే రొమాన్స్ చేస్తారు. ఈలోపు ఇందిరాదేవి అక్కడికి రావడంతో రాజ్ కంగారు పడుతూ బయటకు వెళ్లిపోతాడు.
ఇటు ముసుగులో ఉన్నది ఎవరో కనిపెట్టడానికి ఆమెపై దొంగతనం నింద వేయడమే కరెక్ట్ అని రుద్రాణి అనుకుంటుంది. ఓ నెక్లెస్ తీసి రేవతి బ్యాగులో వేస్తుంది. నెక్లెస్ కనిపించడం లేదని కావ్య కంగారు పడుతుండగా.. ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్లే ఈ పని చేసి ఉంటారని రుద్రాణి అంటుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో రుద్రాణి యొక్క కుట్రలు, స్వరాజ్ మరియు రేవతి మధ్య సంఘటనలు, గణపతి పూజ వంటివి ఉత్కంఠను పెంచాయి. కథ ఎలా ముందుకు సాగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


