|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్‌లో షాకింగ్ ట్విస్ట్: దొంగగా మారిన ఐశ్వర్య, రౌడీయిజం చేసిన ఇందు!

Published: 25-03-2026, 1:05 AM
బ్రహ్మముడి సీరియల్‌లో షాకింగ్ ట్విస్ట్: దొంగగా మారిన ఐశ్వర్య, రౌడీయిజం చేసిన ఇందు!
  • సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య: రాకేష్ అప్పు తీర్చడానికి రేఖ నెక్లెస్ దొంగతనం!
  • ఇంటర్వ్యూలో HRకు తలతిక్క సమాధానమిచ్చిన ఇందు: జాబ్ కొట్టేసిందిగా!
  • రోడ్డుపై ఐశ్వర్యకు లిఫ్ట్ ఇచ్చిన లక్కీ, రాజ్: మరో ట్విస్ట్ మొదలైంది!
  • దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు: పోలీస్ స్టేషన్ సీన్ రిపీట్!

బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ఐశ్వర్య ఏకంగా దొంగగా మారిపోయింది. అంతేకాదు, ఇందు తనదైన స్టైల్ లో రౌడీయిజం చేసింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.

సొంత ఇంట్లోనే ఐశ్వర్య హస్తం!

రాకేష్ డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఐశ్వర్య ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది. ఇంతలో రేఖ తీసుకొచ్చిన నెక్లెస్ గుర్తొస్తుంది. ఆ నెక్లెస్ తన కోసమే తెచ్చింది కాబట్టి….తను అమ్ముకోవడం కాదనుకుంటుంది. అందుకే అది అమ్మేసి రాకేష్ అప్పు తీర్చేయాలనుకుంటుంది. ఇంతలో రేఖ తన గదికి వెళ్లడం చూసి…ఐశ్వర్య కూడా వెళ్తుంది. రేఖ తన లాకర్‍లో నెక్లెస్ పెట్టడం చూస్తుంది. ఐశ్వర్య నక్కి నక్కి చూస్తుండగా భ్రమరాంబ కనిపెడుతుంది. రేఖ గదిలోకి ఎందుకిలా చూస్తోందని అనుకుంటుంది. ఇక రేఖ వెళ్లిపోగా ఆ నెక్లెస్ ఐశ్వర్య తీసుకుని వెళ్లిపోతుంది. ఇది చూసిన భ్రమరాంబ…సొంత మేనకోడలే దొంగతనం చేస్తుంటే మన చేతివాటం కూడా ప్రదర్శించాలని అనుకుంటుంది. ఐశ్వర్య వెళ్లిపోగానే భ్రమరాంబ కూడా వెళ్లి మరో నెక్లెస్ ఎత్తుకెళ్లిపోతుంది.

ఇక మరోవైపు ఇందు ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ HR తలతిక్కగా మాట్లాడుతుంటాడు. జాబ్ కోసం వస్తే ఇలా గందరగోళంగా మాట్లాడుతున్నారని ఇందు కంగారుపడుతుంది. చివరకు ఈ HR తిక్క కుదుర్చుతుంది ఇందు. నీ ధైర్యం, స్మార్ట్ నెస్ నాకు నచ్చాయి…ఈ జాబ్ నీకు వస్తుందని HR అంటాడు. ఇందు సర్టిఫికేట్స్ చూస్తాడు. డిగ్రీ సర్టిఫికేట్ ఏదని అడుగుతాడు. ఇప్పుడే కంప్లీట్ అయింది, కొన్ని రోజుల్లో సర్టిఫికేట్ వస్తుందని ఇందు చెప్తుంది. అలా అయితే జాబ్ ఇవ్వలేం, నీకు సర్టిఫికేట్ వచ్చి నువ్వు తెచ్చి ఇస్తే అప్పుడు నీకు జాబ్ పక్కా ఇస్తానని HR చెప్తాడు. ఇందు అసంతృప్తితో అక్కడినుంచి వెళ్లిపోతుంది.

ఇంటర్వ్యూలో ఇందు రచ్చ.. జాబ్ కొట్టేసిందిగా!

ఐశ్వర్య కారు ఆగిపోయి రోడ్ పై నిల్చుని ఉంటుంది. అటువైపు కారులో లక్కీ, రాజ్ వెళ్తుంటారు. రిచ్ అమ్మాయిల కోసం యాప్స్ లో వెతుకుతుంటారు. ఇంతలో రోడ్‍పై ఉన్న ఐశ్వర్యను చూసి లిఫ్ట్ ఇస్తారు. అప్పటికీ రాజ్ వద్దని చెప్పినా వినిపించుకోడు. లక్కీ కారు ఎక్కిస్తుండగా ఇందు చూస్తుంది. మళ్లీ ఏం పెంట తీసుకొస్తుందని అనుకుని….ఆ కారను ఫాలో అవుతుంది.

ఇంతలో ఇద్దరు దొంగలను తరుముకుంటూ వస్తుంది నందు. ఇందు వచ్చిన ఆటోకు ఎదురుపడతారు. ఆ దొంగ నందును కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఇందు అడ్డుకుని వారిని చితకబాదుతుంది. ఎక్కడ కలిశామో గుర్తుకుతెచ్చుకుంటారు. ఆ రోజు పోలీస్ స్టేషన్‍లో ఎదురుపడ్డామని అనుకుంటారు. దొంగలు మీ వెనుక పడుతున్నారేంటీ అని ఇందు అడిగితే…నేనే వాళ్ల వెంట పడ్డానని నందు చెప్తుంది. అమ్మవారి నగలు దొంగిలించి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని, అందుకే నేను పట్టుకోవాల్సి వచ్చిందని నందు చెప్తుంది. ఆ దొంగలు ఎక్కడ నగలు పెట్టారో తెలుసుకుందాం, అందుకు మీరు హెల్ప్ చేయాలని నందు అడుగుతుంది. సరే అంటుంది ఇందు. అమ్మవారి నగలు ఎక్కడ దాచారు, ఎవరికి అమ్మేసారని దొంగలను అడుగుతుంది. గోల్డ్ షాపులో అమ్మేసామని దొంగలు చెప్పడంతో వారిని అక్కడికి తీసుకెళ్తుంది.

దొంగలతో ఫైటింగ్ చేసిన ఇందు, నందు!

కారులో ఉన్న ఐశ్వర్య బుర్ర తింటాడు లక్కీ. నీ అడ్రస్ ఏంటీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటూ విసిగిస్తాడు. ఇక్కడ కారు ఆపు, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చిందని ఐశ్వర్య చెప్పి దిగిపోతుంది. అప్పుడు కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో లక్కీ ఐశ్వర్యకు చికాకు తెప్పిస్తాడు. ఐశ్వర్య మార్వాడీ షాప్ దగ్గరికి వచ్చి బ్యాగు ఓపెన్ చేస్తే అందులో నెక్లెస్ కనిపించదు. ఎక్కడ పోయిందని అనుకుంటుంది. ఇంట్లో దొంగనయ్యా…ఇప్పుడు ఈ రాకేష్ అప్పు తీర్చేద్దామనుకుంటా ఇలా అయిందేంటీ టెన్షన్ పడుతుంది.

దాహం వేస్తుందని ఓ షాప్ దగ్గర ఆగుతారు లక్కీ, రాజ్. డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటారు. ఇంతలో కారులో ఐశ్వర్య పడేసుకున్న నెక్లెస్ కనిపిస్తుంది. నెక్లెస్ దొరికిందని తెగ సంబరపడిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐశ్వర్య దొంగతనం, ఇందు ఫైటింగ్.. ఈ సీరియల్ లో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.