|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chai Shots: సినిమాస్‌లానే సక్సెస్ అవ్వాలి.. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో రానా

Published: 08-12-2025, 12:32 PM
Chai Shots: సినిమాస్‌లానే సక్సెస్ అవ్వాలి.. ‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో రానా
  • ‘చాయ్ షాట్స్’ దేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫాం.
  • ఇది స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం రూపొందించిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్”.
  • రాబోయే 6 నెలల్లో 200+ క్రియేటర్లతో షోస్ కోసం ₹20 కోట్ల క్రియేటర్ ఫండ్.
  • రానా దగ్గుబాటి, ప్రముఖ ఇన్వెస్టర్లు యాప్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

చాయ్ బిస్కెట్ సరికొత్త ‘చాయ్ షాట్స్’ యాప్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీగా ఇది ప్రారంభమైంది. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. క్రియేటర్లకు రూ.20 కోట్ల భారీ ఫండ్‌ను ప్రకటించడం విశేషం.

చాయ్ షాట్స్: కొత్త డిజిటల్ విప్లవం

తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, చాయ్ బిస్కెట్ దేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి హాజరయ్యారు.

చాయ్ షాట్స్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం రూపొందించబడిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్”. 2 నిమిషాల లోపు ఉండే వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులకు ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారం Info Edge Ventures, General Catalyst మద్దతుతో రూపుదిద్దబడింది. ఎండ్‌లెస్ స్క్రోలింగ్‌కు బదులుగా, Structed, హై-క్వాలిటీ కథల ద్వారా వినోదాన్ని ప్రసాదించడం లక్ష్యం.

క్రియేటర్ల కోసం రెండు ముఖ్య ప్రకటనలు

మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు పిచ్ చేసుకునే ప్రత్యేక పోర్టల్. “పిచ్ నుంచి లైవ్ వరకూ 45 రోజుల్లో!” అనే హామీతో, అప్రూవల్, షూట్ మరియు రిలీజ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

2. ₹20 కోట్ల క్రియేటర్ ఫండ్ రాబోయే ఆరు నెలల్లో 200+ క్రియేటర్లతో ఒరిజినల్ షోస్ రూపొందించేందుకు భారీ పెట్టుబడి. కొత్త రైటర్స్, డైరెక్టర్లు, నటులకు పెద్ద వేదికగా మారనుంది.

క్రియేటర్లకు సువర్ణావకాశం

చాయ్ షాట్స్ ఇటీవల $5 మిలియన్ సీడ్ రౌండ్ ను Info Edge Ventures, General Catalyst నుండి రైజ్ చేసింది. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్లలో రానా దగ్గుబాటి, శ్రీ హర్ష మజేటి & నందన్ రెడ్డి (Swiggy), ఫణీంద్ర సమా (RedBus), అలఖ్ పాండే & ప్రత్యీక్ మహేశ్వరి (PhysicsWallah), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ SR (Rapido), రోహిత్ చెన్నమనేని (DarwinBox), అమర్ నగరం (Virgio) ఉన్నారు.

చాయ్ షాట్స్‌ యాప్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ, తమ్ముళ్లతో కూడిన ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా 200 మంది క్రియేటర్స్ కొత్త కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారని చెప్పారు. రానా, శరత్ అనురాగ్‌తో కలసి టీవీ షోలు, స్టేజి ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్‌లో అనుభవం పంచుకున్నట్లు తెలిపారు. శరత్ ఆలోచనలు క్రియేటివ్, ఇన్నోవేటివ్‌గా ఉంటాయని, తెలుగు యువత ఆడియన్స్‌కు వారు అద్భుతంగా అనుసంధానమవుతారని గుర్తు చేశారు. రానా ఈ ప్రాజెక్ట్‌లో చిన్న భాగం కావడం ఆనందంగా ఉందని, షోలు అన్ని చూస్తారు, ఇన్వెస్టర్స్‌ను సపోర్ట్ చేస్తారని తెలిపారు. కంటెంట్ సినిమాలాగే పాపులర్ కావాలని, క్రియేటర్స్ స్టార్‌లా అవ్వాలని ఆకాంక్షించారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ షాట్స్ లాంచ్‌ను ప్రశంసిస్తూ మాట్లాడుతూ, “మా కంపెనీ లాంచ్‌తో పాటు చాయ్ షాట్స్ కూడా ప్రారంభమై సంతోషంగా ఉంది. శరత్, అనురాగ్‌తో నేను ప్రారంభం నుంచి పని చేస్తున్నాను. వాళ్ల క్రియేటివిటీ, హార్డ్ వర్క్, ఇన్వెస్టర్లను ఆకర్షించడం చూసి చాలా ఆనందం కలిగింది. రోజురోజుకీ మారుతున్న ట్రెండ్స్‌లో చాయ్ షాట్స్ గొప్ప స్థాయికి చేరుతుంది. మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. క్రియేటర్స్, యాక్టర్స్ బిగ్ స్క్రీన్ అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాను. పుష్ప 2 ప్రమోషన్స్, బీహార్ ఈవెంట్స్ ఐడియాలు వాళ్లే ఇచ్చారు. వారిలో అసాధారణ క్రియేటివిటీ ఉంది, భవిష్యత్తులో వేల కోట్ల వ్యాపారానికి వీలుందని ఆయన తెలపారు.

ప్రముఖ యూట్యూబ్ బ్యానర్ చాయ్ బిస్కెట్ సహ వ్యవస్థాపకుడు శరత్, 10 ఏళ్ల ప్రయాణం తరువాత కొత్త వర్టికల్ షార్ట్ సిరీస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వర్టికల్ కంటెంట్ భారీ మార్కెట్‌గా మారినా, భారత్ ఇంకా ఈ విభాగంలో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో, భారత కథల శక్తిని వర్టికల్ ఫార్మాట్‌లో ప్రేక్షకులకు అందించాలన్నదే తమ లక్ష్యమని శరత్ తెలిపారు.

చాయ్ బిస్కెట్ అనురాగ్ మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభం నుంచే కొత్త కంటెంట్ క్రియేటర్లతో పనిచేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు 75 షోలలో కొత్త టాలెంట్‌ను అందించారు. యాప్‌లో కొత్తగా టెక్నీషియన్లు, నటుల వివరాలు చూపించే ఫీచర్‌తో పాటు, వారి పనికి క్లాప్ ఇవ్వడం, ఇష్టమైతే నేరుగా ఆర్టిస్టులకు మనీ కాంట్రిబ్యూట్ చేసే అవకాశాన్ని కూడా అందించారు.

రానా దగ్గుబాటి ప్రశంసలు

సీటీవో కృష్ణ మాట్లాడుతూ.. శరత్, అనురాగ్‌తో పనిచేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. మేము ఒక అద్భుతమైన ప్రోడక్ట్‌ని రూపొందించాం—వర్టికల్ ఫార్మాట్‌లో ప్రతి ఎపిసోడ్ రెండు నిమిషాల చిన్న కంటెంట్‌తో. ప్రతి ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ హుక్ ఉంటుంది. యాప్ చాలా ఈజీ, ఫాస్ట్, అందరికీ అనువుగా ఉంటుంది. ఇందులో ఉన్న కంటెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. పేమెంట్ ప్రాసెస్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. మా VIP మెంబర్షిప్ తీసుకుని కంటెంట్‌ని ఎంజాయ్ చేయండి.

రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర మాట్లాడుతూ, చాయ్ షాట్స్ తెలంగాణ అభివృద్ధికి ప్రతిబింబమని పేర్కొన్నారు. టాప్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రావడం గొప్ప విషయమని, చాయ్ షాట్స్ విలువైన, నాణ్యమైన కంటెంట్ ఇవ్వడం ప్రత్యేకత అని చెప్పారు. ఇండియా వ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి అవకాశమని, సంస్థ అద్భుతాలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని మాట్లాడుతూ.. చాయ్ బిస్కెట్ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, శరత్ చెప్పిన టెక్నాలజీ యాప్ స్టార్ట్‌అప్ ఐడియా తనను ఆకట్టుకున్నదని పేర్కొన్నారు. హైదరాబాదులో ప్రారంభమైన ఈ ప్రయాణం గ్లోబల్ కంపెనీగా ఎదుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. తెలుగు డబ్బింగ్ షాట్లు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెంట్రల్ క్యాటలిస్ట్ రాహుల్ హుమాయున్ మాట్లాడుతూ.. శరత్‌ ని కలిసినప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా, రా ఎమోషన్‌తో మాట్లాడటం తనను ఆకట్టుకున్నట్టు. కంటెంట్‌పై అతనికి ఉన్న ప్యాషన్, చాయ్ బిస్కెట్‌తో కలిసి పనిచేయడం తనకు ఎక్సైటింగ్‌గా అనిపించిదన్నారు. ఇండియా కోసం కంటెంట్‌ను నిర్మించే ఈ ప్రయాణం హైదరాబాదు నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఈవెంట్‌లో చాయ్ బిస్కెట్ టీం, క్రియేటర్స్ పాల్గొన్నారు.

‘చాయ్ షాట్స్’ యాప్ కొత్త కంటెంట్, యువ క్రియేటర్లకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. రానా మద్దతుతో, ఇది తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.