|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాంపియన్ సస్పెన్స్: ఆ స్టార్ హీరో మేనమామ పాత్ర.. ఎవరో తెలిస్తే షాక్!

Published: 01-01-2026, 1:00 AM
ఛాంపియన్ సస్పెన్స్: ఆ స్టార్ హీరో మేనమామ పాత్ర.. ఎవరో తెలిస్తే షాక్!
  • ఛాంపియన్ సినిమాలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగీనేని నటించారు.
  • ఆయన ‘రంగయ్య’ పాత్రలో మెరిసి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
  • నటుడిగానే కాకుండా, బిగ్ బెన్స్ బ్యానర్‌పై ‘పెళ్లి చూపులు’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
  • నిర్మాతగా ‘దొరసాని’, ‘డియర్ కామ్రేడ్’, ‘భాగ్ సాలె’ వంటి సినిమాలు తీసి మంచి గుర్తింపు పొందారు.

ఇటీవల విడుదలైన ఛాంపియన్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ఓ పాన్ ఇండియా స్టార్ హీరో మేనమామ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ స్టార్ హీరో ఎవరు, ఆయన మేనమామ ఎవరు, ఆ సినిమాలో ఆయన పాత్ర ఏమిటి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఛాంపియన్ లో ఊహించని మెరుపు!

Champion: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు సినిమాలలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ గా.. టాలీవుడ్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఒక స్టార్ హీరో మేనమామ ఇటీవల వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఛాంపియన్ సినిమాలో నటించారని తెలుసా ? ఈ విషయం తెలిసి ఆడియన్స్ తో పాటూ సదరు హీరో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన కోసం మళ్లీ ఈ సినిమా చూస్తున్నారు కూడా. మరి ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ఆయన మేనమామ ఎవరు ? ఈ సినిమాలో ఏ పాత్రలో నటించారు? ఇంతకుముందు ఆయన ఏదైనా సినిమాలో నటించారా? లేక ఇదే ఆయన తొలి సినిమానా? అంటూ అభిమానులు సైతం పలు రకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పెళ్లి సందD సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రోషన్ మేక (Roshan meka) చాలాకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ (Anaswara rajan) హీరోయిన్ గా నటించడమే కాకుండా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. అందమైన ప్రేమకథను కూడా తెరపై ప్రదర్శించారు. అలా ఈ సినిమా అటు యువతను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో రంగయ్య పాత్ర మంచి ఫేమస్ అందుకుంది. ఈ నేపథ్యంలోని ఈ పాత్రలో నటించిన ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ పాన్ ఇండియా స్టార్ మేనమామ ఎవరు?

నటుడిగా, నిర్మాతగా యశ్ రంగీనేని ప్రస్థానం.

ఆయన ఎవరో కాదు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మేనమామ. ఈయన పేరు యశ్ రంగీనేని (Yash Rangineni). నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఈయన మంచి సక్సెస్ అందుకున్నారు. బిగ్ బెన్స్ బ్యానర్ ను స్థాపించి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి చిత్రమైన పెళ్లి చూపులు చిత్రాన్ని ఈ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు. అలాగే దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబిసిడి , భాగ్ సాలె, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. నిర్మాతగా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి పేరు తెచ్చుకున్న ఈయన నటనపై ఆసక్తి ఉండడం పైగా అటు ఈ సినిమాలో అవకాశం రావడంతో రంగయ్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి తన కలను నెరవేర్చుకున్నారు.

మొత్తానికి ఛాంపియన్ సినిమా విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగీనేనిని నటుడిగా ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా, ఆయన నిర్మించిన విజయవంతమైన చిత్రాలను మరోసారి గుర్తుచేసింది. ఈ ఆశ్చర్యకర విషయం సినిమాకు మరింత ప్రచారం తెచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.