|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీదే అగ్రస్థానం! చంద్రబాబు సంచలన ప్రకటన!

Published: 06-04-2026, 6:05 AM
మైక్రో ఇరిగేషన్‌లో ఏపీదే అగ్రస్థానం! చంద్రబాబు సంచలన ప్రకటన!
  • మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్
  • డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి
  • గత 21 నెలల్లో నీటి భద్రతలో గణనీయమైన మార్పులు
  • భూగర్భజలాలను 1.92 మీటర్ల మేర పెంచగలిగిన ప్రభుత్వం

అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రకటించారు. నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నెంబర్ వన్

అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. నీటిని నిల్వ చేసుకుంటే అదే సంపద సృష్టి్స్తుందన్నారు.

ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని చంద్రబాబు అన్నారు. పంటకుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.

‘అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చాం. 90 శాతం మేర సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమే. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం.’ అని చంద్రబాబు అన్నారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చిన డ్రిప్ ఇరిగేషన్

డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని, హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు, ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయని, చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగామన్నారు. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భజలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగామన్నారు.

‘గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే చేపట్టిన భూసంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగటం సంతోషం కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారు. ఈ ఉద్యమంలో ప్రజలందరికీ నేను తోడుగా ఉంటాను. అన్నమయ్య జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.

20 వేలకు పైగా బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక్క జిల్లాలో 96 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. భూగర్భజలాలు పెరగటం మూలంగా హరిత ప్రాంతం పెరిగిందని, ఇవన్నీ సానుకూలమైన అంశాలు అన్నారు. వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.

నీటి సంరక్షణతో పెరిగిన భూగర్భజలాలు

ఇలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదని, రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే ఎప్పటికప్పుడు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు చంద్రబాబు. శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుందన్నారు. మొత్తంగా 1300 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంటుందని చెప్పారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

నీటి సంరక్షణ చర్యలతో భూగర్భజలాలు పెరిగాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని ఆయన సూచించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.