
📌 Key Points
- దీపం లబ్ధిదారులు పీఎన్‌జీకి మారినా రాయితీ సొమ్ము బ్యాంకు ఖాతాలోకే.
- రాబోయే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం ఆదేశం.
- గ్యాస్ సరఫరా సమస్యలను అధిగమించామని తెలిపిన అధికారులు.
- కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించారు. ఇకపై పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు(పీఎన్జీ)కి మారినా కూడా రాయితీ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలిపారు.
పీఎన్జీకి మారినా రాయితీ వర్తింపు: చంద్రబాబు ప్రకటన
ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు(పీఎన్జీ) దీపం పథకం లబ్ధిదారులు మారినా.. రాయితీ సొమ్మును వారి బ్యాంకు అకౌంట్లోకి వేస్తామన్నారు. ఎల్పీజీపై కొన్ని రోజులుగా ఆందోళనలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
పశ్చి్మాసియా ఉద్రిక్తతల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని చంద్రబాబు అన్నారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారితే.. వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని… దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ధి పొందవచ్చన్న విషయంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
గ్యాస్ సరఫరా సమస్యలపై సమీక్ష: అధికారులకు సీఎం ఆదేశాలు
గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు మాట్లాడారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని… ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని తెలిపారు. డొమెస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని… త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామన్నారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో… సమీక్ష నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు.
కేంద్ర మంత్రికి ఫోన్: పైప్‌లైన్ పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తి
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి, దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా రాయితీ అందేలా చూడటం ద్వారా ప్రభుత్వం గ్యాస్ వినియోగంలో మరింత ప్రోత్సాహం అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులకు భారం తగ్గనుంది.


